Share News

Live Updates: కేటీఆర్‌‌కు లీగల్‌ నోటీసులు

ABN , First Publish Date - Sep 26 , 2024 | 07:44 AM

Breaking News Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Live Updates: కేటీఆర్‌‌కు లీగల్‌ నోటీసులు

Live News & Update

  • 2024-09-26T18:53:39+05:30

    కేటీఆర్‌‌కు లీగల్‌ నోటీసులు

    • హైదరాబాద్‌: అమృత్‌ టెండర్ల ఆరోపణలపై కేటీఆర్‌కు నోటీసులు

    • కేటీఆర్‌కు లీగర్‌ నోటీసలు పంపిన సృజన్‌రెడ్డి

    • తప్పుడు ఆరోపణలతో తన పరువుకు నష్టం కలిగిందంటూ..

    • కేటీఆర్‌కు లీగల్ నోటీసులు పంపిన సృజన్‌రెడ్డి

  • 2024-09-26T16:49:19+05:30

    జగన్ తిరుమల వస్తే ఆలయం అపవిత్రం అవుతుంది

    • ప్రకాశం: ఐదేళ్ళపాటు సీఎంగా పని చేసిన జగన్ ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు.

    • ఇంతటి పరాభవం ఎదురవుతుందని జగన్ ఊహించి ఉండరు.

    • మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ నానా గడ్డి కరుస్తున్నాడు.

    • తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని సాక్ష్యాలు ఉన్నాయి.

    • రాజకీయానికి వాడుకోవాలని జగన్ చూస్తున్నాడు.

    • ఏ విచారణ కైనా సిద్దమని జగన్ అంటున్నాడు.

    • ఏ విచారణ జరపొద్దని వైవి సుబ్బారెడ్డి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు.

    • జగన్ తిరుమల వెళ్తే ఆలయం అపవిత్రం అవుతుంది.

    • జగన్ హిందువా, క్రిస్టియనా అనే చర్చ జరుగుతుంది.

    • జగన్ క్రైస్తవుడని ఆయన తల్లి, భార్య చెబుతున్నారు: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

  • 2024-09-26T15:45:56+05:30

    అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అపవిత్రం

    • పిఠాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కార్యకర్తలతో కలిసి దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ

    • వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో భారీ లడ్డూ కుంభకోణం

    • లడ్డూ ప్రసాదాల విషయంలో కోట్లాది రూపాయలు కాజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది

    • లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి హిందువుల మనోభావాలు దెబ్బ తీశాడు

    • అక్రమాలపై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు ముందుకొచ్చారు

    • తిరుమల లడ్డూ ప్రసాదంతోపాటు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు

    • వైసీపీ ట్రస్ట్ బోర్డు రైతు డైరి వద్ద నెయ్యి కొనుగోలు విషయంలో భారీగా అవకతవకలకు పాల్పడ్డారు

  • 2024-09-26T15:31:01+05:30

    జగన్ తిరుమల పర్యటనలో కుట్ర

    • గుంటూరు జిల్లా: ఈనెల 28వ తేదీన తిరుమలకు వైసీపీ అధినేత జగన్

    • జగన్ పర్యటనలో కుట్ర ఉంది: సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ

    • హిందూ ధర్మ విశ్వాసాలను రెచ్చగొట్టేందుకే తిరుమల వస్తున్నారు.

    • జగన్‌కు వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉంటే భార్య భారతితో కాలినడకన వచ్చి గుండు చేయించుకోవాలి,

    • తిరుమల డిక్లరేషన్‌లో జగన్ సంతకం పెడితే దర్శనానికి అనుమతి ఇవ్వాలి.

    • లేదంటే అలిపిరి వద్ద అడ్డుకుని తీరుతాం: సనాతన ధర్మ పరిరక్షణ జేఏసి నేతలు

  • 2024-09-26T13:35:22+05:30

    మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ

    శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆకస్మిక తనిఖీ

    శ్రీకాకుళంలో గల సొరండాల వీధిలో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన లోకేశ్

  • 2024-09-26T12:28:47+05:30

    • సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

    • హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, ఈటీవీ బ్యూరో చీఫ్ నారాయణ మృతి

    • నారాయణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

    • నారాయణ ఆకస్మిక మరణం బాధాకరం

    • నారాయణ కుటుంబానికి ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా

    • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

  • 2024-09-26T11:45:55+05:30

    చైనా ఆన్‌లైన్ గేమింగ్ అప్లికేషన్‌పై ఈడీ చర్యలు

    • ఆన్‌లైన్ గేమింగ్ యాప్ FIEWINతో చైనాకు చెందిన వ్యక్తుల క్రిప్టో ఖాతాలను స్తంభింపజేసిన ఈడీ.

    • రూ.25 కోట్ల విలువైన క్రిప్టో ఖాతాలు సీజ్

    • భారత్ నుంచి గేమింగ్ యాప్ ద్వారా రూ.400 కోట్లు చైనాకు చేరాయి: ఈడీ

    • కేసుతో సంబంధం ఉన్న నలుగురు భారతీయల అరెస్ట్

    • భారత్ నుంచి రూ.400 కోట్ల డబ్బు చైనాకు చేరింది.

    • గేమింగ్ యాప్ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చైనా కుట్ర

    • చైనాకు చెందిన ముగ్గురి క్రిప్టో ఖాతాలు స్వాధీనం

  • 2024-09-26T10:32:22+05:30

    వినూత్న నిరసన

    • విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వినూత్న రీతిలో జన జాగరణ సమితి నిరసన

    • దేవర సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు

    • విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇవ్వాలని జన జాగరణ సమితి విజ్ఞప్తి

    • నగరంలో చాలా చోట్ల దేవర సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు

    • విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదాలతో పోస్టర్లు

  • 2024-09-26T09:51:20+05:30

    బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.

    • తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన వారు మళ్ళీ అక్కడికి వెళ్లొద్దు

    • తిరుమల వెళితే హిందువులు ఏకమై వారిని చంపేస్తారు.

    • ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు గౌరవించాల్సిందే.. లేకుంటే ఇబ్బందులు తప్పవు.

    • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి

    • ఆలయాలు, దేవదాయ ధర్మాదాయ శాఖ భూములను కాపాడాలి.

    • తిరుపతి, శ్రీశైలంలో అన్య మతస్తులు మత మార్పిడి చేసే అవకాశం ఉంది.

  • 2024-09-26T09:08:58+05:30

    దుర్గమ్మ లడ్డూ ప్రసాదం తయారీలోనూ లోపాలు!

    • తనిఖీల్లో షాకింగ్ విషయాలు

    • దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో వాడే జీడిపప్పు ప్యాకెట్లపై కనిపించని లేబుల్స్

    • దుర్గమ్మ లడ్డూ ప్రసాదం నాణ్యతపై భక్తుల అనుమానాలు

    • ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ లోపాలు

    • నాసిరకం సరుకు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు

    • జీడిపప్పు, ఇతర ప్యాకెట్లపై కనిపించని లేబుల్స్

    • నాణ్యత లేదని 1,100 కిలోల కిస్మిస్, 700 కేజీల జీడిపప్పును తిరస్కరించిన అధికారులు

    • జీడిపప్పు, కిస్మిస్ నాణ్యతకు తిలోధకాలు

  • 2024-09-26T08:41:35+05:30

    నేడు జనసేనలోకి కీలక వైసీపీ నేతలు

    • ఇవాళ జనసేనలో చేరనున్న పలువురు వైసీపీ నాయకులు

    • ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి, సామినేని ఉదయభాను,‌ కిలారు‌ రోశయ్య

    • ఈ ముగ్గురితో పాటు వందల సంఖ్యలో స్థానిక సంస్థల ప్రతినిధులతో జనసేనలో చేరనున్నట్లు ప్రకటన

    • ఈ రోజు సాయంత్రం 4 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్న నేతలు

    • జగన్ ఒంటెద్దు పోకడలతో విసిగిపోయి రాజీనామా

  • 2024-09-26T08:18:21+05:30

    ఏపీలో అక్టోబర్ 3 నుంచి దసరాకు ప్రత్యేక బస్సులు

    • 13 రోజులు పాటు తిరిగే విధంగా ప్రత్యేక బస్సు సర్వీసులు

    • రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో 964 బస్సులు

    • హైదరాబాద్ విజయవాడ మధ్య అత్యధికంగా 353 బస్సులు

    • రాజమండ్రికి 241, విశాఖపట్నంకు 90, బెంగళూరుకు 14 బస్సు

    • చెన్నైకి 22, ఇతర ప్రాంతాలకు 244 ప్రత్యేక బస్సులు సిద్ధం

  • 2024-09-26T07:58:40+05:30

    గాంధీ ఆసుపత్రిలో ఒక రోజు శిశువు కిడ్నాప్ కలకలం.

    • నిన్న పుట్టిన పాపను తీసుకొని వెళ్ళిన దగ్గరి బంధువులు

    • పెంచుకోవడానికి పసిగుడ్డును ఇచ్చినట్టు అనుమానాలు

    • తల్లికి విషయం తెలియడంతో చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు

    • తల్లి ఫిర్యాదుతో కిడ్నాప్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న పోలీసులు

    • సురక్షితంగా పాపను తీసుకొచ్చిన పోలీసులు

  • 2024-09-26T07:48:32+05:30

    నివురు గప్పిన నిప్పులా భద్రాద్రి ఏజెన్సీ

    • చర్ల మండలం పూసుగుప్ప సీ‌ఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై నిన్న రాత్రి మావోయిస్టుల మెరుపు దాడి

    • అరగంట పాటు మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు

    • ప్రాణనష్టంపై అధికారిక ప్రకటన చేయని పోలీస్ అధికారులు, మావోయిస్టులు

    • ఛత్తీస్‌గడ్ ధర్మారం క్యాంప్‌నకు 2 కిలో మీటర్ల దూరంలోనే పూసుగుప్ప క్యాంప్

    • సెప్టెంబర్ 5న కరకగూడెం ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతం

    • మావోయిస్టులు తెలంగాణలో అడుగు పెట్టకుండా తెలంగాణ పోలీస్ హెచ్చరిక

    • ఆపరేషన్ కగార్‌లో భాగంగా కొనసాగుతున్న భారీ కూంబింగ్

    • ఉలిక్కిపడ్డ తెలంగాణ పోలీస్

    • పూసుగుప్ప క్యాంప్‌పై దాడితో నిఘా వర్గాల ఆరా

    • హై అలర్ట్ జోన్‌గా మారిన చర్ల మండలం

    • భారీగా సాగుతున్న కూంబింగ్