Share News

Caste Census: దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి: జాజుల

ABN , Publish Date - Nov 30 , 2024 | 05:53 AM

తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

Caste Census: దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి: జాజుల

మంచిర్యాల, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ప్రధాని బీసీ అయి ఉండి కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని, కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం లేదని విమర్శించారు. ఈనెల 6వ తేదీ నుంచి శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కులగణన చైతన్య యాత్ర ముగింపు సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.


బీసీ గణన చేపట్టడం లేదని, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం లేదని, మహిళా బిల్లులో బీసీలకు సబ్‌ కోటా పెట్టలేదని అన్నారు. దేశవ్యాప్తంగా జాతి జనగణన, బీసీల డిమాండ్ల సాధన కోసం ఉద్యమం చేపట్టనున్నట్లు జాజుల తెలిపారు. రాష్ట్రంలో బీసీలను రాజకీయ పోరాటానికి సిద్ధం చేసే దిశగా బీసీ రథయాత్ర చేపడతామని తెలిపారు.

Updated Date - Nov 30 , 2024 | 05:53 AM