Bhatti: ఝార్ఖండ్‌ను దోపిడీదారులపాలు కానివ్వకండి
ABN , Publish Date - Nov 11 , 2024 | 04:16 AM
ఝార్ఖండ్ వనరులను తమకు కావాల్సిన కొద్దిమంది పెట్టుబడిదారుల చేతిలో పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.
ఇండియా కూటమినే గెలిపించండి: భట్టి
హైదరాబాద్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఝార్ఖండ్ వనరులను తమకు కావాల్సిన కొద్దిమంది పెట్టుబడిదారుల చేతిలో పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి.. ఝార్ఖండ్ వనరులు దోపిడీదారుల పాలు కాకుండా కాపాడుకోవాలంటూ ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఝార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడిగా ఉన్న భట్టి.. ఆదివారం రాంఘర్ నియోజకవర్గ కాంగ్రెస్ బూత్ లెవల్ మీటింగ్, చిత్తార్పూర్ బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అదానీ, అంబానీ వంటి పెట్టుబడిదారుల నుంచి ఝార్ఖండ్‌కు విముక్తి కల్పించాలన్నారు.