Home » Bhatti Vikramarka
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వ్యయంపై నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వ్యయానికి సంబంధించి 32 శాఖల పనితీరుపై ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
గతంలో కాంగ్రెస్ పాలకులు దూర దృష్టితో నిర్మించిన బహుళార్థక ప్రాజెక్టుల వల్లనే ఈనాడు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి
ఝార్ఖండ్ ప్రజలపై బీజేపీకి ప్రేమ లేదని, ఇక్కడి అపార ఖనిజ సంపదపైన ఆ పార్టీ కన్నేసిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోవడంతో అమాయకులను రెచ్చగొడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కూల్చడంపైనే ఆ పార్టీ దృష్టి పెట్టిందన్నారు.
లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి బీఆర్ఎస్ కుట్రేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం అరాచక శక్తుల ద్వారా అమాయకులైన దళిత, గిరిజన రైతులను రెచ్చగొట్టి దాడి చేయించారని ధ్వజమెత్తారు.
ఝార్ఖండ్ వనరులను తమకు కావాల్సిన కొద్దిమంది పెట్టుబడిదారుల చేతిలో పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నందున.. ఈ నెల 14వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు 26 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా విజయోత్సవాల’ను నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
Telangana: హౌస్ లిస్టింగ్ పూర్తి చేసి ఈరోజు (శనివారం) నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఎన్యుమరేటర్లతో కలెక్టర్లు విస్తృతంగా మాట్లాడాలని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలన్నారు. దేశం మొత్తం తెలంగాణను గమనిస్తోందని.. ప్రజల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయన్నారు.
ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
ప్రభుత్వం చేపట్టిన కులగణన... రేషన్ కార్డులనో, పథకాల లబ్ధిదారులను తగ్గించడానికో కాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ సర్వే జరగొద్దని కొంతమంది కుట్ర చేస్తున్నారని, అందుకే అపోహలు సృష్టిస్తున్నారని పరోక్షంగా బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఆరోపించారు.