Share News

Hyderabad: డీఎస్పీగా బాక్సర్‌ నికత్‌ జరీన్‌..

ABN , Publish Date - Sep 19 , 2024 | 03:55 AM

మహిళా బాక్సర్‌ నికత్‌ జరీన్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీ్‌స(డీఎస్పీ)గా నియమితులయ్యారు.

Hyderabad: డీఎస్పీగా బాక్సర్‌ నికత్‌ జరీన్‌..

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మహిళా బాక్సర్‌ నికత్‌ జరీన్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీ్‌స(డీఎస్పీ)గా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం డీజీపీ జితేందర్‌ను ఆయన కార్యాలయంలో కలిసిన ఆమె జాయినింగ్‌ రిపోర్టు అందజేశారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నికత్‌... బాక్సింగ్‌లో రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు.


ఆమెకు జూబ్లీహిల్స్‌లో 600 గజాల ఇంటిస్థలంతో పాటు గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు ప్రభుత్తం గతంలోనే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆమెను డీఎస్పీగా నియమిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Sep 19 , 2024 | 03:55 AM