Konda Surekha: ప్రముఖ ఆలయాల్లో ప్రతి సోమవారం దీపోత్సవం
ABN , Publish Date - Nov 05 , 2024 | 04:02 AM
కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రతి సోమవారం దీపోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.
మంత్రి కొండా సురేఖ వెల్లడి
కీసర, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రతి సోమవారం దీపోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇందులో భాగంగా మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్టలో జరిగిన దీపోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
దీపోత్సవం సందర్భంగా మహిళలకు పసుపు, కుంకుమ, జాకెట్ పీస్‌తో కూడిన కిట్‌ను అందజేస్తున్నామని చెప్పారు. ప్రముఖ ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, యాదగిరి గుట్ట ఆలయ గోపురానికి 63 కిలోల బంగారు తాపడం చేయిస్తామన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర గల కీసరగుట్ట ఆలయ అభివృద్ధిపై కూడా డీపీఆర్ సిద్ధం చేసినట్లు చెప్పారు.