Share News

CM Revanth Reddy: కేసీఆర్‌ కుర్చీ ఖాళీ..!

ABN , Publish Date - Jun 03 , 2024 | 03:50 AM

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలంటూ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేసి, ప్రొటోకాల్‌ ప్రకారం ఆహ్వానం పంపినా.. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్‌ రాలేదు! ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్‌ హాజరవలేదు.

CM Revanth Reddy: కేసీఆర్‌ కుర్చీ ఖాళీ..!

  • ప్రభుత్వం ఆహ్వానించినా.. వేడుకలకు హాజరుకాని వైనం

  • అసెంబ్లీలో, రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లోనూ అంతే!

  • ప్రభుత్వం ఆహ్వానించినా.. హాజరుకాని వైనం

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలంటూ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేసి, ప్రొటోకాల్‌ ప్రకారం ఆహ్వానం పంపినా.. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్‌ రాలేదు! ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్‌ హాజరవలేదు. ప్రభుత్వం ఆహ్వానించినా.. వేడుకలకు రాకపోవడంపై నెట్టిం ట విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. అటు అసెంబ్లీలో, ఇటు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్‌ కోసం ఏర్పాటు చేసిన కుర్చీ ఖాళీగానే దర్శనమివ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హుందాగా వ్యవహరించారు. దశాబ్ది ఉత్సవాలకు మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రొటోకాల్‌ విభాగానికి చెందిన ప్రభుత్వ ప్రతినిధుల ద్వారా ఆహ్వాన పత్రిక పంపించారు.


ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్‌కు ఆయన హోదాకు తగినట్లుగా వేదికపై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమర్‌ పక్కన సోఫా వేశారు. కానీ, వేడుకలకు కేసీఆర్‌ హాజరుకాలేదు. వేదికపై కేసీఆర్‌ కోసం వేసిన కుర్చీ ఖాళీగా కనిపించడంతో సోషల్‌ మీడియాలో కేసీఆర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియా, పాకిస్థాన్‌కు ఒకేసారి స్వాతంత్య్రం ప్రకటించినా.. పాక్‌ మాత్రం దుర్బుద్ధితో ఒక రోజు ముందే స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకున్నట్లుగా, కేసీఆర్‌ సైతం ఒకరోజు ముందే ఆవిర్భావ దినోత్సవం చేసుకొని, వదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దశాబ్ది ఉత్సవాలను చూస్తే పాలపిట్టను చూసినట్లు ఉందని తెలంగాణ ఉద్యమకారులు భావిస్తుండగా.. కేసీఆర్‌ మాత్రం వేడుకలకు రాకుండా పరువు పోగొట్టుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jun 03 , 2024 | 03:50 AM