CM Revanth Reddy: సీఎం షెడ్యూల్‌లో మార్పులు..
ABN , Publish Date - Sep 03 , 2024 | 07:57 AM
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తిరుమలాయపాలెం బ్రిడ్జి, నెల్లికుదురు మండలం రావిరాలలో సీఎం పర్యటించాల్సి ఉండగా షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా ఆయన ఖమ్మం నుంచి నేరుగా సీతారాంనాయక్ తాండా చేరుకోనున్నారు.
మహబూబాబాద్: మూడ్రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిలలాడుతున్నారు. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ బాధితులకు స్వయంగా భరోసా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిన్న(సోమవారం) ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అలాగే నేడు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
ముందుగా మరిపెడ మండలం తిరుమలాయపాలెం బ్రిడ్జి, నెల్లికుదురు మండలం రావిరాలలో పర్యటించాల్సి ఉండగా సీఎం షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా ఆయన ఖమ్మం నుంచి నేరుగా సీతారాంనాయక్ తాండా చేరుకోనున్నారు. గ్రామాన్ని వరదనీరు ముంచెత్తడంతో సుమారు 100మంది పోలీసులు కాపాడారు. విషయం తెలుసుకున్న సీఎం ముందుగా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఆ తర్వాత తిరుమలాపాలెం బ్రిడ్జి, రావిరాల గ్రామాలకు వెళ్లే అవకాశం ఉంది.