CM Revanth: బీఆర్ఎస్, కేసీఆర్‌పై ప్రజల్లో ఆదరణ పెరుగుతోందా.. ముఖ్యమంత్రి స్పందన ఇదే
ABN , Publish Date - May 08 , 2024 | 11:44 AM
సానుభూతి లేకున్నా ఎందుకో కొంత బీఆర్‌ఎస్(BRS) పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందనే అభిప్రాయం వస్తోంది. అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్(CM Revanth Reddy) ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
హైదరాబాద్: సానుభూతి లేకున్నా ఎందుకో కొంత బీఆర్‌ఎస్(BRS) పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందనే అభిప్రాయం వస్తోంది. తద్వారా, మొన్నటి వరకూ ఊపు మీద ఉన్న బీజేపీపై కొంత ప్రభావం పడుతోందని అంటున్నారు. నిజమేనా!? అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్(CM Revanth Reddy) ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
"అవకాశం ఉంది సార్.. బీఆర్‌ఎస్ పడుకుంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో కాంగ్రెసేతర ఓటర్లు బీజేపీకి వెళ్లడానికి అవకాశం ఉంది. ఇది గమనించే.. రాజకీయంగా అనుకూల పరిస్థితి లేకపోయినా మొత్తానికే తుడిచిపెట్టుకపోయే పరిస్థితి ఉంటుందనే భయంతో యాత్ర మొదలు పెట్టాడు. పార్లమెంట్ ఎన్నికలైన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఓటు బ్యాంకును కాపాడుకోకపోతే రేపు పార్టీ ఉనికే ఉండదని కేసీఆర్ గ్రహించారు. గ్రామాల్లో వదులుకుంటే రేపు పార్టీ ఉండదనే వాస్తవాన్ని గుర్తించారు. బీఆర్‌ఎస్ నుంచి బీజేపీకి వలస పోయే ఓట్లను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా, ఉన్న ఓటును నిలుపుకోవచ్చు. కొంత పెంచుకోవచ్చు. ఉన్న ఓట్లలో బీఆర్‌ఎస్ నుంచి వంద ఓట్లు బయటికి పోతుంటే.. 20నో 30నో మాకు వస్తే మిగిలిన 70 ఓట్లు బీజేపీకి పోతాయి. ఆ పార్టీ మనుగడ సాగిస్తుందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది"అని అన్నారు.
కేసీఆర్ ఆత్మవిశ్వాసం పెరిగిందా..
కేసీఆర్(KCR) ఆత్మ విశ్వాసం పెరిగినట్టుంది.. తాను బస్సు యాత్ర చేయడంతోనే రైతుబంధు నిధులు విడుదల చేశారని ఆయన అంటున్నారు అన్న ఆర్కే కామెంట్స్‌కు రేవంత్ స్పందిస్తూ.. "2018 వానాకాలానికి మేలో రైతు బంధు డబ్బులు వేయడం మొదలుపెట్టి సెప్టెంబరులో పూర్తి చేశాడు.
2019-20లో జూన్‌లో మొదలుపెట్టి డిసెంబరు వరకు వేశాడు. 2020-21లో జనవరిలో మొదలుపెట్టి అక్టోబరు వరకు వేశారు. మేం డిసెంబరులో మొదలుపెట్టి మే 7వ తేదీకి వంద శాతం పూర్తి చేశాం. మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగింపు కాగానే కేసీఆర్ చేసిన అప్పులకు రూ.27 వేల కోట్లు కట్టాల్సి వచ్చింది. ఈ ఐదు నెలల్లో కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తి కింద రూ.30 వేల కోట్లు కట్టా" అని పేర్కొన్నారు.
ABN Big Debate: రూ.2 లక్షల రుణమాఫీ సాధ్యమేనా.. క్లారిటీ ఇచ్చిపడేసిన రేవంత్
ఇదికూడా చదవండి: Hyderabad: బీజేపీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్ ఉండాలి
Read Latest Telangana News and National News
Read Latest National News and Telugu News