Share News

Congress: ఫిరాయింపులు షురు చేసిందే కేసీఆర్‌

ABN , Publish Date - Sep 12 , 2024 | 04:06 AM

ఎమ్మెల్యేల ఫిరాయింపులు మొదలు పెట్టిందే కేసీఆర్‌ అని... చీర, గాజులు ఆయనకు పంపాలని కౌశిక్‌రెడ్డికి మహిళా కార్పొరేషన్‌..

Congress: ఫిరాయింపులు షురు చేసిందే కేసీఆర్‌

  • చీర, గాజులు ఆయనకు పంపు

  • కాంగ్రెస్‌ మహిళా నేతల ఫైర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఎమ్మెల్యేల ఫిరాయింపులు మొదలు పెట్టిందే కేసీఆర్‌ అని... చీర, గాజులు ఆయనకు పంపాలని కౌశిక్‌రెడ్డికి మహిళా కార్పొరేషన్‌.. ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్‌ పర్సన్లు శోభారాణి, కాల్వ సుజాత, అధికార ప్రతినిధులు భవానీరెడ్డి, సంధ్యారెడ్డి సూచించారు. ఇతర పార్టీల నాయకుల చేరికతోనే టీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందని, కేసీఆర్‌ రాజకీయ పుట్టుక ఎక్కడుందో చూసుకోవాలని అన్నారు. గాంధీభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని విచారణకు పిలవాలని మహిళా కమిషన్‌ను కోరారు.


మహిళల్ని అగౌరవపరిస్తే ఆయనకు చెప్పుదెబ్బలు తప్పవన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి.. మెంటల్‌ కౌశిక్‌గా మారి తలతిక్కగా మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మట్టా రాగమయి ధ్వజమెత్తారు. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. పదేళ్ల పాటు ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావులకు ఏం పంపుతావని ప్రశ్నించారు. మహిళల్ని అవమానించిన కౌశిక్‌రెడ్డిపై తక్షణమే కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్‌ను ఆమె కోరారు.

Updated Date - Sep 12 , 2024 | 04:06 AM