పోటీపై అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం: జీవన్‌రెడ్డి
ABN , Publish Date - Nov 30 , 2024 | 05:50 AM
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఎవరుంటారనే నిర్ణయం తీసుకునేది కాంగ్రెస్ అధిష్ఠానమేనని, ఇందులో తన వ్యక్తిగత నిర్ణయం ఏం ఉండదని సిటింగ్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.
జగిత్యాల, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఎవరుంటారనే నిర్ణయం తీసుకునేది కాంగ్రెస్ అధిష్ఠానమేనని, ఇందులో తన వ్యక్తిగత నిర్ణయం ఏం ఉండదని సిటింగ్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాలలోని స్థానిక ఇందిరాభవన్‌లో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ తాను పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని అధిష్ఠానానికి టీపీసీసీ తీర్మానించి నివేదించిందన్నారు. నివేదిక పరిశీలన తర్వాత హైకమాండ్ నిర్ణయం మేరకే పోటీలో ఎవరు ఉంటారనేది స్పష్టమవుతుందని వెల్లడించారు. అధిష్ఠానం నిర్ణయించిందే పార్టీ అమలు చేయాల్సి ఉంటుందన్నారు.