Share News

Cyberabad CP: ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు..

ABN , Publish Date - Aug 14 , 2024 | 10:00 AM

కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మహంతి(Cyberabad CP Avinash Mahanty) హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Cyberabad CP: ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు..

- ఆరు నెలల నుంచి 10 ఏళ్ల వరకు జైలు

- సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మహంతి హెచ్చరిక

హైదరాబాద్‌ సిటీ: కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మహంతి(Cyberabad CP Avinash Mahanty) హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు ఏర్పాటు చేసేలా యాజమాన్యం, ప్రిన్సిపాళ్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ర్యాగింగ్‌ నిషేధిత చట్టం 1997 ప్రకారం.. తీవ్రమైన శిక్షార్హమైన నేరం అని తెలిపారు. ఆరునెలల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదికూడా చదవండి: Secunderabad: కంటోన్మెంట్‌లో కొత్త నిబంధనలు !


దోషిగా తేలితే విద్యార్థిని విద్యా సంస్థ నుంచి పంపించడమే కాకుండా మరే ఇతర విద్యా సంస్థల్లోనూ ప్రవేశం పొందే అవకాశం ఉండదని సీపీ హెచ్చరించారు. విద్యార్థులు ఇబ్బందులకు గురైనా, ర్యాగింగ్‌(Raging) పేరుతో ఎవరైనా వేధించినా వెంటనే డయల్‌100కు ఫోన్‌ చేయాలని సూచించారు. ఈ మేరకు కమిషనరేట్‌ పరిధిలోని కళాశాలలు, యూనివర్సిటీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Crime: శంషాబాద్ పీఎస్ పరిధిలో దారుణం...


..........................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.............................................................................

Rain: జడివాన.. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌ సిటీ: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కార్యాలయాలకు వెళ్లే సమయంలో వర్షం పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా మారేడ్‌పల్లి, ముషీరాబాద్‌(Maredpally, Mushirabad) ప్రాంతాల్లో 9 మిల్లీమీటర్లు, సైదాబాద్‌, బౌద్ధనగర్‌ ఏరియాల్లో 8 మిల్లీమీటర్లు, ఉప్పల్‌, చార్మినార్‌ ప్రాంతాల్లో 6.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

city2.2.jpg


అమీర్‌పేట్‌, పంజాగుట్ట, మెహిదీపట్నం, టోలిచౌకి(Ameerpet, Panjagutta, Mehdipatnam, Tolichowki) ప్రాంతాల్లో నాలాల్లోకి నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయ్యాయి. సాయంత్రం హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌(Hayatnagar, LBnagar)లో మోస్తరు వర్షం పడింది.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 14 , 2024 | 10:00 AM