Share News

Cricket Betting: క్రికెట్ బెట్టింగ్ వేస్తున్నారా.. లక్షల రూపాయలు స్వాహా.. మొత్తం ఆరుగురు..

ABN , Publish Date - Apr 10 , 2024 | 02:18 PM

ఐపీఎల్ వచ్చిందంటే చాలు.. క్రీడాభిమానుల సందడి కన్నా బెట్టింగ్ రాయుళ్ల హంగామానే ఎక్కువైపోతుంది. రహస్యంగా బెట్టింగ్ దందాను నడిపిస్తూ.. లక్షల నుంచి కోట్ల దాకా భారీ మొత్తాన్ని పొగేసుకుంటున్నారు. అటు.. బెట్టింగ్స్ వేస్తున్న వాళ్లు రోడ్డుపాలవుతున్నారు.

Cricket Betting: క్రికెట్ బెట్టింగ్ వేస్తున్నారా.. లక్షల రూపాయలు స్వాహా.. మొత్తం ఆరుగురు..

ఐపీఎల్ (IPL) వచ్చిందంటే చాలు.. క్రీడాభిమానుల సందడి కన్నా బెట్టింగ్ రాయుళ్ల హంగామానే ఎక్కువైపోతుంది. రహస్యంగా బెట్టింగ్ దందాను (Cricket Betting) నడిపిస్తూ.. లక్షల నుంచి కోట్ల దాకా భారీ మొత్తాన్ని పొగేసుకుంటున్నారు. అటు.. బెట్టింగ్స్ వేస్తున్న వాళ్లు రోడ్డుపాలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగంలోకి దిగి.. బెట్టింగ్ ముఠాల ఆటకట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కడ దాక్కున్నా.. వెతికి మరీ పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. సైబరాబాద్ ఎస్ఓటీ (SOT) పోలీసులు ఆల్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు. మొత్తం ఆరుగురి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

బ్రౌన్ రైస్‌తో బోలెడన్ని లాభాలు.. ఈ సమస్యలన్నీ దూరం


గుంటూరులోని నర్సారావు పేటకు చెందిన శాకమూరి వెంకటేశ్వరరావు అలియాస్ చిన్ను ఆద్వర్యంలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం నడుస్తోంది. మియాపూర్ పీఎస్ పరిధిలోని మాతృశ్రీ నగర్‌లో ఉన్న శ్రీనిధ సర్వీస్ అపార్ట్‌మెంట్ అడ్డాగా ఈ బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు సమాచారం అందింది. దీంతో.. పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి, నిందితుల అడ్డాకు వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ‘క్రికెట్ లైవ్ గురు’, ‘లక్కీ ఆన్‌లైన్ యాప్’ల ద్వారా ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 43,57,461 రూపాయలతో పాటు ల్యాప్ టాప్స్, కొన్ని మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ.. అందుకు నిరాకరించిన న్యాయస్థానం

ఈ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో 50 మంది దాకా ఫండర్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు వారి ఆచూకీ కనుగొనే పనిలో నిమగ్నమయ్యారు. ఈ బెట్టింగ్ లావాదేవీల కోసం నిందితులు ఐదు బ్యాంక్ ఖాతాలను వినియోగించినట్లు తెలిసింది. ఈ ఐదు ఖాతాల్లో మూడున్నర లక్షలు ఉండగా.. ఆ మొత్తం అమౌంట్‌ని ఫ్రీజ్ చేసేశారు. నిందితుల్లో ప్రధాన నిందితుడైన వెంకటేశ్వరరావుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2024 | 02:18 PM