Share News

Dana Nagender: తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే హైడ్రా..

ABN , Publish Date - Sep 17 , 2024 | 12:02 PM

తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌(MLA Dana Nagender) అన్నారు. తెలంగాణలో చాలా ప్రాంతాలు, చెరువులు అన్యాక్రాంతమయ్యాయన్నారు.

Dana Nagender: తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే హైడ్రా..

- దానం నాగేందర్‌

తిరుమల: తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌(MLA Dana Nagender) అన్నారు. తెలంగాణలో చాలా ప్రాంతాలు, చెరువులు అన్యాక్రాంతమయ్యాయన్నారు. అనేక ప్రదేశాల్లో కబ్జాలను తొలగించేందుకు హైడ్రా తీసుకువచ్చామన్నారు. హైకోర్డు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అన్యాక్రాంతమైన ప్రాంతా ల్లో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేసే అంశాలపై ఆలోచనలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసమే తప్ప వ్యక్తిగతంగా ఎవరిపైనా కక్షసాధింపు కోసం కాదన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్న ఆయన ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడారు.

ఇదికూడా చదవండి: History of Balapur Laddu: బాలాపూర్ లడ్డూ చరిత్ర ఇదే..


విభజన తర్వాత మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గాంధీని పట్టుకుని బీఆర్‌ఎస్‌ నేత కౌశిక్‌రెడ్డి ఆంధ్రాకు చెందిన ఎమ్మెల్యే అంటూ మాట్లాడటం దారుణమన్నారు. ఏపీ, తెలంగాణ అనే విభేదాలు పుట్టించి అక్కడున్న వారిని భయాందోళనకు గురిచేసేలా జరుగుతున్న కుట్రపై ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూడా ప్రజలు తప్పకుండా బీఆర్‌ఎస్‏కు బుద్ధి చెప్తారన్నారు. తన మనవరాలి పుట్టువెంట్రుకలు సమర్పించేందుకు కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చి శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నామన్నారు.


........................................................................

ఈ వార్తను కూడా చదవండి:

........................................................................

MLA: రద్దు చేసిన రేషన్‌కార్డులను పునరుద్ధరించాలి

- డీలర్లకు నెల వేతనం ఇవ్వాలి

- మంత్రి ఉత్తమ్‌కు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి లేఖ

city5.jpg

హైదరాబాద్: కొత్తరేషన్‌ కార్డుల జారీతోపాటే రేషన్‌ డీలర్ల సంక్షేమంపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి(Malkajigiri MLA Marri Rajasekhar Reddy) పలు సూచనలు చేస్తూ సోమవారం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. నియోజకవర్గంలో 76 వేల రేషన్‌కార్డుదారులకు 105 రేషన్‌ దుకాణాల ద్వారా రేషన్‌ సరుకుల పంపిణీ చేపడుతున్నారు. ఈ సేవలకు సంబంధించిన పలు విషయాలు ఈ లేఖలో వివరించారు. హెచ్‌ఐవీ, తలసీమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులతో పాటు కీమోథెరపీ చికిత్స పొందుతున్న క్యాన్సర్‌ బాధితులకు, డయాలసిస్‌ రోగులకు కొత్తరేషన్‌ కార్డులు అందజేయాలని సూచించారు. రేషన్‌కార్డులో చేర్పులు, మార్పులు స్థానికంగా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని, సదరం సర్టిఫికెట్లు కలిగి ఉన్న వారికి 35 కేజీల బియ్యం అందించాలని, స్మార్ట్‌కార్డు ద్వారా సేవలు అందించాలని, రద్దు చేసిన కార్డులను పునరుద్ధరణ చేయాలని ఆయన పేర్కొన్నారు.


రేషన్‌ డీలర్లకు రూ.20 వేల వేతనం ఇవ్వాలి..

రేషన్‌డీలర్ల సంక్షేమానికి కూడా ఎమ్మెల్యే మర్రి పలు సూచనలు చేశారు. పట్టణ ప్రాంత డీలర్లకు నెలకు రూ.20 వేల వేతనం ఇవ్వాలని కోరారు. జీవిత, ప్రమాదబీమా పాలసీలను రేషన్‌డీలర్లకు కల్పించాలని పేర్కొన్నారు. గన్నీ బ్యాగుల లీకేజీలను నివారించాలని, ప్రజాపంపిణీ తేదీతో నిమిత్తం లేకుండా నెల రోజులు చేపట్టాలని సూచించారు. జనాభా ప్రాతిపాదికన షాపులను పెంచేలా చర్యలు తీసుకొవాలని కోరుతూ మంత్రి ఉత్తమ్‌కు ఎమ్మెల్యే లేఖ రాసినట్లు పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: Jani Master: జానీ మాస్టర్‌పై..లైంగిక దాడి కేసు

ఇదికూడా చదవండి: Rajagopal Reddy: పొద్దుగాల ఈ తాగుడేంది?

ఇదికూడా చదవండి: BRS: రేవంత్‌రెడ్డిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం ..

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 17 , 2024 | 12:02 PM