Share News

DSP: ఏ భయమూ వద్దు.. అత్యవసరంలో ఫోన్‌ చేయండి..

ABN , Publish Date - Jul 20 , 2024 | 01:49 PM

మణుగూరుతోపాటు సబ్‌ డివిజన్‌ ప్రజలు వచ్చే వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని మణుగూరు డీఎస్‌పీ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ రాఘవరెడ్డి సూచించారు. డీఎస్‌పీ రవీందర్‌రెడ్డి(DSP Ravinder Reddy) విలేకరులతో మాట్లాడారు.

DSP: ఏ భయమూ వద్దు.. అత్యవసరంలో ఫోన్‌ చేయండి..

మణుగూరుటౌన్‌(భద్రాద్రి కొత్తగూడెం): మణుగూరుతోపాటు సబ్‌ డివిజన్‌ ప్రజలు వచ్చే వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని మణుగూరు డీఎస్‌పీ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ రాఘవరెడ్డి సూచించారు. డీఎస్‌పీ రవీందర్‌రెడ్డి(DSP Ravinder Reddy) విలేకరులతో మాట్లాడారు. వరదల కారణంగా అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటే వెంటనే 100కు డయల్‌ చేయాలని, లేదా స్థానిక పోలీస్‌స్టేషన్లకు సమాచారమివ్వాలన్నారు. గోదావరి నది పెరుగుతున్న నేపధ్యంలో నది సమీప గ్రామాల ప్రజలు నదివైపు వెళ్లవద్దని, పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని సూచించారు.

ఇదికూడా చదవండి: IAS: నో డౌట్.. నేను పని చేస్తా.. చేయిస్తా..!


మణుగూరు మున్సిపాలిటీ, మండలంలోని పలు వరద ప్రాంతాలను, చెరువులను, వాగులను, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలను శుక్రవారం తహసీల్దార్‌ రాఘవరెడ్డి సందర్శించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి గోదావరి ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు గోదావరి నదిలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 20 , 2024 | 01:49 PM