Share News

Egg Price: సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గిన కోడి గుడ్ల ధర

ABN , Publish Date - May 11 , 2024 | 11:14 AM

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా చికెన్‌ ధరలు(chicken price) పెరిగాయి. దీంతోపాటు కోడి గుడ్ల రేట్లను(egg price) కూడా పౌల్ట్రీ సంస్థలు పెంచేశాయి. అయితే ఎండల వేడికి తట్టుకోలేక కోళ్లు భారీగా మృత్యువాత చెందిన క్రమంలో ఈ రేట్లు పెరిగినట్లు పౌల్ట్రీ యజమానులు చెప్పారు. కానీ ఇటివల కురిసిన వర్షాల నేపథ్యంలో మళ్లీ సామాన్య ప్రజలకు ఊరట లభించింది.

Egg Price: సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గిన కోడి గుడ్ల ధర
Egg Price decreased on may 11th 2024

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా చికెన్‌ ధరలు(chicken price) పెరిగాయి. దీంతోపాటు కోడి గుడ్ల రేట్లను(egg price) కూడా పౌల్ట్రీ సంస్థలు పెంచేశాయి. అయితే ఎండల వేడికి తట్టుకోలేక కోళ్లు భారీగా మృత్యువాత చెందిన క్రమంలో ఈ రేట్లు పెరిగినట్లు పౌల్ట్రీ యజమానులు చెప్పారు. కానీ ఇటివల కురిసిన వర్షాల నేపథ్యంలో మళ్లీ సామాన్య ప్రజలకు ఊరట లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా కోడి గుడ్ల ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. ఒక కోడి గుడ్డు ధర రూ.5.25 నుంచి ఈరోజు రూ. 4.8కి చేరుకుంది. మరోవైపు డజన్ కోడి గుడ్లను రూ. 57కు సేల్ చేస్తున్నారు.


ఈ వాతావరణం ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో కోడి గుడ్ల ధరలు(egg rate) మరింత తగ్గుతాయని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. ఇటివల ఎండల కారణంగా అనేక కోళ్లు మృత్యువాత చెంది నష్టపోయినట్లు పౌల్ట్రీ నిర్వాహకులు తెలిపారు. ఆ సమయంలో కోళ్లతోపాటు గుడ్ల సరఫరాపై కూడా ప్రభావం చూపిందని అన్నారు. ఇదే నెలలో పది రోజుల క్రితం ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండటం విశేషం. కోడి గుడ్ల ధరలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉత్పత్తి, సరఫరాను బట్టి రేట్ల ధరల్లో మార్పులు ఉంటాయనేది గమనించాలి.


ఇది కూడా చదవండి:

Hyderabad: హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు భారీగా పయనం..


Hero Shivaji :ఏపీని కాపాడుకోవడానికి ఇదే చివరి అవకాశంఏపీని కాపాడుకోవడానికి ఇదే చివరి అవకాశం



Read Latest Telangana News and Telugu News

Updated Date - May 11 , 2024 | 11:17 AM