Share News

Surayapet: ఆరు తరాలు ఒక్కచోటే..

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:29 AM

ఆరు తరాల కుటుంబ సభ్యులు ఒకే వేదికపై ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి క్షేత్రంలోని ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం వేదికైంది.

Surayapet: ఆరు తరాలు ఒక్కచోటే..

  • మట్టపల్లిలో కోలాహలంగా వంశ వృక్ష ఆత్మీయ సమేళ్మనం

  • ఆరు తరాలకు చెందిన 367మంది హాజరు

మఠంపల్లి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆరు తరాల కుటుంబ సభ్యులు ఒకే వేదికపై ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి క్షేత్రంలోని ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం వేదికైంది. నేరేడుచర్లకు చెందిన రాచకొండ వీరయ్య, లక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరయ్య, లక్ష్మమ్మ దంపతులు కిరాణా దుకాణం నడుపుతూ పిల్లలందరికీ పెళ్లిళ్లు చేశారు.


కుమారులు-కోడళ్లు, కుమార్తెలు-అల్లుళ్లు మనుమలు, మునిమనుమలు, మనవరాళ్లు ఇలా మొత్తం ఈ కుటుంబంలో 411 మంది ఉన్నారు. వీరిలో చాలామంది వ్యాపారం చేస్తుండగా, యువతరంలోని పలువురు ఉద్యోగాల రీత్యా విదేశాల్లో స్థిరపడ్డారు. ఏడేళ్ల క్రితం రాచకొండ వీరయ్య, లక్ష్మమ్మ దంపతులు మృతిచెందగా, వారి జ్ఞాపకార్ధం ఆదివారం వంశవృక్ష ఆత్మీయ వేడుక నిర్వహించారు. ఆ కుటుంబానికి చెందిన రాచకొండ శ్రీనివాసరావు మూడు నెలలుగా అందరికీ సమాచారం ఇస్తూ, అవసరమైన నగదును, ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి 367మంది హాజరయ్యారు.

Updated Date - Oct 21 , 2024 | 03:29 AM