Share News

Congress: రుణమాఫీ.. రైతు హ్యాపీ

ABN , Publish Date - Aug 26 , 2024 | 03:59 AM

ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Congress: రుణమాఫీ.. రైతు హ్యాపీ

  • పాత లోన్‌ మాఫీ కావడంతో కొత్తగా రుణం

  • కాడెద్దులు, బండిని కొనుగోలు చేసిన అన్నదాత

కొడంగల్‌, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏకంగా 2 లక్షల వరకు లోన్‌ మాఫీ చేస్తుండటంతో అన్నదాతల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన సాయప్పకు రూ. 1.80 లక్షల రుణం మాఫీ అయ్యింది. దాంతో ఆ రైతు మళ్లీ లోన్‌ తీసుకొని కాడెద్దులు, బండి కొనుగోలు చేశాడు. సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని రైతు మెచ్చుకున్నాడు.

Updated Date - Aug 26 , 2024 | 03:59 AM