Share News

CM Revanth Reddy: బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకొని రైతులు ఆగం కావద్దు: సీఎం

ABN , Publish Date - Aug 22 , 2024 | 03:26 PM

రూ.2 లక్షల రుణమాఫీకి(Loan Waiver) కాంగ్రెస్ ప్రభుత్వం 100 శాతం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు.

CM Revanth Reddy: బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకొని రైతులు ఆగం కావద్దు: సీఎం

హైదరాబాద్: రూ.2 లక్షల రుణమాఫీకి(Loan Waiver) కాంగ్రెస్ ప్రభుత్వం 100 శాతం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సన్నాసుల మాటలు నమ్ముకొని రైతులు ఆగం కావద్దని సూచించారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

కొన్ని సాంకేతిక కారణాలతో కొందరికి మాత్రమే రుణాలు మాఫీ జరగలేదని, త్వరలోనే పూర్తిగా రుణాలు మాఫీ అవుతాయని పేర్కొన్నారు. ఏ ఒక్కరికి రుణం మాఫీ కాకపోయినా.. ఇక్కడ తాము ఉన్నామన్న విషయాన్ని మర్చిపోవద్దని కోరారు.


కలెక్టర్ ఆఫీసుల్లో అధికారులు...

"ఏ రైతుకి రుణమాఫీ రాకపోయినా మేం ఉన్నాం. కలెక్టర్ ఆఫీసుల్లో కుర్చీ వేసి ఆఫీసర్లను కూర్చోబెట్టాం. రైతు విషయంలో కొందరు దొంగ దీక్షలు చేస్తున్నారు. రైతులకు రోడ్డెక్కాల్సిన బాధ ఏమొచ్చింది? సన్నాసులను నమ్ముకొని ఆగం కావద్దు. రైతుల సమస్యలు విననప్పుడు ధర్నాలు చేయాలి. మీ సమస్యలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తొందరపడొద్దని కర్షక సోదరులను కోరుతున్నాం. రైతుల సమస్యను ప్రభుత్వం వింటుంది. పదేళ్లు దోచుకున్న వాళ్లను, ఆరునెలల కింద బొంద పెట్టిన వారిని మళ్ళీ గ్రామాల్లోకి ఎందుకు రానిస్తున్నారు. రుణమాఫీ హామీ అమలు చేయడంతో హరీశ్ తన పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని ఇవాళ కొత్త డ్రామా మొదలు పెట్టారు.

డ్రామాలో భాగంగానే దేవాలయాల వద్ద నిరసనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. వారిపట్ల ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. రుణమాఫీ చేయడంతో బీఆర్ఎస్ నేతలకు ఏం చేయాలో పాలుపోవట్లేదు. దీంతో అబద్ధాలకు తెరతీశారు. కేటీరామారావు రుణమాఫీ విషయంలో పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. వారు రూ.లక్ష రుణం మాఫీ చేయడానికే ఆపసోపాలు పడ్డారు. అప్పటికీ అందరికీ పూర్తి చేయలేదు. కానీ మేం ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణాలను మాఫీ చేశాం" అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి...

TG News:10 ఐ ఫోన్లను ఆ కొరియర్ బాయ్ ఏం చేశాడో తెలుసా!

Konda muarali: బస్వరాజు సారయ్యపై కొండా మురళి ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 22 , 2024 | 03:28 PM