Share News

Hyderabad: ఫుడ్ సేఫ్టీ దాడుల్లో దారుణమైన విషయాలు.. జిహెచ్ఎంసి సీరియస్ యాక్షన్..

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:21 PM

గ్రేటర్‌లో జిహెచ్ఎంసి హెల్త్ సైరన్ మోగించింది. హోటల్స్, రెస్టారెంట్లపై మెరుపు దాడులు కొనసాగుతున్నాయి.

Hyderabad: ఫుడ్ సేఫ్టీ దాడుల్లో దారుణమైన విషయాలు.. జిహెచ్ఎంసి సీరియస్ యాక్షన్..
GHMC

హైదరాబాద్ : గ్రేటర్‌లో జిహెచ్ఎంసి హెల్త్ సైరన్ మోగించింది. హోటల్స్, రెస్టారెంట్లపై మెరుపు దాడులు కొనసాగుతున్నాయి. సిటీలో ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి సీరియస్ అయింది. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి మేయర్ విజయలక్ష్మి తనిఖీలు చేపట్టారు.

ప్రాణాలకే ప్రమాదం..

ఫుడ్ సేఫ్టీ దాడుల్లో దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుళ్ళిన చికెన్, మటన్‌తో పలు హోటల్స్ బిర్యానీ తయారు చేస్తున్నట్లు తేలింది. ఓల్డ్ సిటీ హోటల్స్ లో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెలను వంటకాల్లో వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వాడకంతో ప్రాణాలకే ప్రమాదమంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు హోటల్స్ కు భారీగా పెనాల్టీలు, ఫుడ్ సేఫ్టీ లైసెన్లు రద్దు చేశారు. హోటల్స్ నిర్వాహకుల్లో మార్పు వచ్చేంతవరకు తనిఖీలు చేయాలంటూ అధికారులకు మేయర్ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Nov 14 , 2024 | 12:21 PM