Share News

TG Govt: ఫుడ్‌ పాయిజన్‌పై సర్కారు సీరియస్‌

ABN , Publish Date - Nov 14 , 2024 | 04:38 AM

మంచిర్యాల జిల్లాలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాల, ఆసిఫాబాద్‌ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చోటు చేసుకున్న ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

TG Govt: ఫుడ్‌ పాయిజన్‌పై సర్కారు సీరియస్‌

  • మంచిర్యాల జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సస్పెన్షన్‌

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల జిల్లాలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాల, ఆసిఫాబాద్‌ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చోటు చేసుకున్న ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు పై అధికారులకు సరైన సమాచారం ఇవ్వని కారణంగా మంచిర్యాల జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎం.గంగారాంపై వేటు వేసింది. ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


మరోవైపు ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో వంట చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించని వంటమనిషి హరికృష్ణతో పాటు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు కమల, పెంటయ్యలను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. వీరితో పాటు పాఠశాలపై సరైన పర్యవేక్షణ నిర్వహించడం లేదంటూ.. హెడ్‌మాస్టర్‌ డి.శ్రీనివాస్‌, ఒక ఏఎన్‌ఎంపై బదిలీ వేటు వేశారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - Nov 14 , 2024 | 04:38 AM