Share News

Passport Renewal: విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి పాస్‌పోర్టు హక్కు కాదు: హైకోర్టు

ABN , Publish Date - Jul 25 , 2024 | 03:40 AM

క్రిమినల్‌ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి పాస్‌పోర్ట్‌ను తన హక్కుగా కోరరాదని హైకోర్టు స్పష్టం చేసింది. అందుకు పాస్‌పోర్ట్‌ చట్టం అనుమతించదని తెలిపింది.

Passport Renewal: విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి పాస్‌పోర్టు హక్కు కాదు: హైకోర్టు

క్రిమినల్‌ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి పాస్‌పోర్ట్‌ను తన హక్కుగా కోరరాదని హైకోర్టు స్పష్టం చేసింది. అందుకు పాస్‌పోర్ట్‌ చట్టం అనుమతించదని తెలిపింది. క్రిమినల్‌ కేసులు ఉన్న వ్యక్తులు సంబంధింత ట్రయల్‌ కోర్టును ఆశ్రయించి తాత్కాలికంగా ఏడాది, రెండేళ్ల కాలానికి కొత్త పాస్‌పోర్ట్‌ లేదా పాత పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌కు అనుమతి పొందవచ్చని చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ ధర్మాసనం పేర్కొంది. పెండింగ్‌ క్రిమినల్‌ కేసులతో సంబంధం లేకుండా పాస్‌పోర్ట్‌ జారీచేయాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది.


నల్లగొండ జిల్లాకు చెందిన అనంతరాజు గౌడ్‌పై 2017 నుంచి క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉంది. అతను పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోగా పోలీసుల తనిఖీల్లో కేసు ఉన్నట్లు తేలడంతో పాస్‌పోర్ట్‌ అధికారులు దరఖాస్తుదారు వివరణ కోరారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. క్రిమినల్‌ కేసులతో సంబంధం లేకుండా పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌ చేయాలని సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలపై పాస్‌పోర్ట్‌ అథారిటీ, కేంద్రం డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది.

Updated Date - Jul 25 , 2024 | 03:40 AM