Share News

Hyderabad: 20 నిమిషాల ప్రయాణానికి.. 1:10 గంటల సమయం..

ABN , Publish Date - Jun 16 , 2024 | 09:50 AM

నగరంలో శనివారం పలుప్రాంతాల్లో భారీ ట్రాఫిక్‌ జామ్‌(Heavy traffic jam) ఏర్పడింది. వాహనదారులు రోడ్డుపై నరకయాతన అనుభవించారు. ముఖ్యంగా వెస్టుజోన్‌ పరిధిలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.

Hyderabad: 20 నిమిషాల ప్రయాణానికి.. 1:10 గంటల సమయం..

- నగరంలో ట్రాఫిక్‌ నరకం

- వాహనదారుల ఆక్రోశం

హైదరాబాద్‌ సిటీ: నగరంలో శనివారం పలుప్రాంతాల్లో భారీ ట్రాఫిక్‌ జామ్‌(Heavy traffic jam) ఏర్పడింది. వాహనదారులు రోడ్డుపై నరకయాతన అనుభవించారు. ముఖ్యంగా వెస్టుజోన్‌ పరిధిలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రాత్రి 7 నుంచి తొమ్మిది గంటల వరకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కేవలం 20 నిమిషాల ప్రయాణానికి గంట పదినిమిషాలు పట్టిందంటే రోడ్లపై ట్రాఫిక్‌ జామ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బక్రీద్‌ పండుగ ఏర్పాట్ల నేపథ్యంలో ముస్లింల షాపింగ్‌, పాతబస్తీలోని పలుప్రాంతాలతో పాటు.. మలక్‌పేట, చాదర్‌ఘాట్‌, ఎంజేమార్కెట్‌, నాంపల్లి, ఖైరతాబాద్‌, పంజాగుట్టతో పాటు.. సికింద్రాబాద్‌, బేగంపేట(Secunderabad, Begumpet) తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా వెస్టుజోన్‌, నార్త్‌జోన్‌లలో సైతం భారీ ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడటంతో వాహనదారులు నరకం చూశారు. ట్రాఫిక్‌ పోలీసుల ప్లానింగ్‌ లోపం, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యమే అందుకు కారణమని వాహనదారులు ఆరోపిస్తున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: దయచేసి అమ్మను చంపొద్దు...


సీఎం రాక సందర్భంగా..

బంజారాహిల్స్‌ రోడ్‌నంబర్‌-12లో ఉన్న తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీనివాస్ రెడ్డితోపాటు ఇతర మంత్రులు, సీఎస్‌ శాంతికుమారి తదితరులు సందర్శించారు. వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు.. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్‌లో భాగంగా లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేయడం కూడా ట్రాఫిక్‌ జామ్‌కు కారణమని తెలుస్తోంది.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 16 , 2024 | 09:50 AM