Hyderabad: 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
ABN , Publish Date - Jul 04 , 2024 | 10:59 AM
ఈనెల 9న వైభవంగా జరుగనున్న బల్కంపేట ఎల్లమ్మ(Balkampeta Ellamma) కల్యాణంకు సంబంధించిన ఏర్పాట్లు నత్త నడకన కొనసాగుతున్నాయి. ఆలయ అధికారుల అవగాహన లోపం, ప్రజాప్రతినిధుల పట్టింపులేమి వెరసి కల్యాణానికి 15 రోజుల ముందు నుంచే ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు చకచక జరుగాల్సి ఉండగా ఎలాంటి ప్రచారాల ఆర్బాటాలు లేకుండా ఆలయ అధికారులు వ్యవహరిస్తున్నారు.
- నత్త నడకన ఏర్పాట్లు
- నేటికీ ఖరారు కాని ఉత్సవ కమిటీ
- ఇన్‌చార్జ్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల కోసం నిరీక్షణ
హైదరాబాద్: ఈనెల 9న వైభవంగా జరుగనున్న బల్కంపేట ఎల్లమ్మ(Balkampeta Ellamma) కల్యాణంకు సంబంధించిన ఏర్పాట్లు నత్త నడకన కొనసాగుతున్నాయి. ఆలయ అధికారుల అవగాహన లోపం, ప్రజాప్రతినిధుల పట్టింపులేమి వెరసి కల్యాణానికి 15 రోజుల ముందు నుంచే ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు చకచక జరుగాల్సి ఉండగా ఎలాంటి ప్రచారాల ఆర్బాటాలు లేకుండా ఆలయ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న డ్రైనేజీ కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాల్సిన వాటర్ వర్క్స్ అధికారులు బుధవారం ప్రారంభించారు. నెమ్మదిగా కొనసాగిస్తూ మురుగు వ్యార్ధాలను రోడ్లపైనే పడవేస్తున్నారు. ఇకపోతే బల్కంపేట ఓళీ క్రాస్ స్కూల్‌కు వెళ్లే రహదారి నుంచి ఎస్‌ఎస్ బేకరీ వరకు మధ్యలో ఉన్న డివైడర్లలోని చెట్ల కొమ్మలను నరికి నడి రోడ్డుకు ఇరువైపులా అడ్డదిడ్డంగా పడవేస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: వేగంగా ఖైరతాబాద్ గణపతి విగ్రహ తయారీ పనులు..
మాజీ మంత్రి, ప్రస్తుత సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Sanatnagar MLA Talasani Srinivas Yadav) సోదరుడు మృతి చెందడంతో నెల రోజుల వరకు ఆయన ఎలాంటి దైవ కార్యాలయాలకు వచ్చే వీలు లేకుండా పోయింది. దీంతో పలు శాఖల అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. రోడ్ల భవనాల శాఖ అధికారులు సైతం ఈ పనులపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ తూతూ మంత్రంగా ఇటీవల సమీక్ష సమావేశం నిర్వహించి ఆ పై పెద్దగా పట్టించుకుపోవడంతో ఇక్కడ ఏర్పా ట్లు మందకోడిగా సాగుతున్నాయి.
నేటికీ ఖరారు కాని ఉత్సవ కమిటీ
ఎల్లమ్మ కల్యాణానికి 15 రోజుల ముందే ఉత్సవ కమిటీ ప్రారంభం కావాల్సి ఉండగా నేటికీ దాని ఊసేలేకుండాపోయింది. మాజీమంత్రి తలసాని శ్రీనివా్‌సయదవ్ ఈ కమిటీని ముందస్తుగా ఏర్పాటుచేసి వారివారి బాధ్యతలను అప్పగిస్తూ నిరంతరం పర్యవేక్షించేవారు. ఈ సారి మాత్రం కేవలం 15 మందితోనే ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి వారి జాబితాను నేటికీ ప్రకటించలేదు. దీంతో అయోమయం నెలకొంది. ఈ కమిటీని ప్రకటించేందుకు దేవాదాయ శాఖ అధికారులు పొన్నం ప్రభాకర్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు.
కల్యాణం టికెట్లపై అయోమయం
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే దంపతుల కోసం ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు దీని టికెట్ ధరను రూ.2,500గా నిర్ణయించి విక్రయించేవారు. ఈసారి మాత్రం ఎన్ని టికెట్లు ఖరారు చేశారు. ఎంత మంది భక్తులకు విక్రయించారనే స్పష్టతలేకుండా పోయింది. స్థానికులు వెళ్లి తమకు కల్యాణ టికెట్లు కావాలని కోరితే పూర్తిగా విక్రయించినట్లు చెబుతున్నారు. దీంతో ఈవో, సుపరింటెండెంట్‌తో గొడవ పడుతున్నారు. ఇకనైనా ఇన్‌చార్జిమంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగి ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై దృష్టిసారించి, ఉత్సవ కమిటీ ఏర్పాటుకు ఆమోదముద్ర వేయాలని పలువురు స్థానికులు, స్వచ్ఛందసంస్థల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News