Share News

Hyderabad: వారిని బదిలీ చేసినా వెళ్లరట!

ABN , Publish Date - Jul 27 , 2024 | 10:23 AM

వాటర్‌బోర్డు(Waterboard)లో కొందరు అధికారులను బదిలీ చేసినా వెళ్లడం లేదు. తమ కుర్చీలను వదలడం లేదు. మేనేజర్లుగా, డిప్యూటీ మేనేజర్లుగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఎండీ ఉత్తర్వులు జారీ చేసినా వాళ్లు పట్టించుకోవడం లేదు. ఇక్కడికి బదిలీ అయినవారిని రానివ్వడం లేదు. రాజకీయ పలుకుబడితో అవసరమైతే ఉన్నతాధికారులపైనే ఒత్తిడి తీసుకొస్తున్నారు.

Hyderabad: వారిని బదిలీ చేసినా వెళ్లరట!

- వాటర్‌బోర్డు ఎండీ ఉత్తర్వులకు విలువే ఇవ్వరు!

హైదరాబాద్‌ సిటీ: వాటర్‌బోర్డు(Waterboard)లో కొందరు అధికారులను బదిలీ చేసినా వెళ్లడం లేదు. తమ కుర్చీలను వదలడం లేదు. మేనేజర్లుగా, డిప్యూటీ మేనేజర్లుగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఎండీ ఉత్తర్వులు జారీ చేసినా వాళ్లు పట్టించుకోవడం లేదు. ఇక్కడికి బదిలీ అయినవారిని రానివ్వడం లేదు. రాజకీయ పలుకుబడితో అవసరమైతే ఉన్నతాధికారులపైనే ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో వాటర్‌బోర్డు ఎండీ బదిలీల ఉత్తర్వులన్నీ నామమాత్రంగానే మారుతున్నాయి.

ఇదికూడా చదవండి: Hyderabad: పాతబస్తీ బోనాలు.. నగరంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు


వాటర్‌బోర్డులో ఈ నెల 20న 49 మంది మేనేజర్లను బదిలీ చేస్తూ ఎండీ ఉత్తర్వులిచ్చారు. వారంతా సకాలంలో కేటాయించిన పోస్టుల్లో జాయిన్‌ కావాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాతబస్తీ డివిజన్‌-2ఏ వినయ్‌నగర్‌ సెక్షన్‌లోని మేనేజర్‌ను డివిజన్‌-5లోని బోట్స్‌క్లబ్‌ ఏరియాకు బదిలీ చేశారు. కానీ వినయ్‌నగర్‌ సెక్షన్‌లో ఉన్న మేనేజర్‌ అక్కడి నుంచి రిలీవ్‌ అయి వెళ్లకుండా అక్కడే కొనసాగుతున్నారు. డివిజన్‌ 2బీలోని మైసారం సెక్షన్‌ నుంచి డివిజన్‌- 2ఏలోని వినయ్‌నగర్‌ సెక్షన్‌కు బదిలీపై వచ్చిన మేనేజర్‌ నుంచి జాయినింగ్‌ రిపోర్టునే తీసుకోలేదు. దీంతో చేసేదిలేక తిరిగి మైసారం సెక్షన్‌లోనే ఆయన పనిచేస్తున్నారు. ఇదే తరహాలో బదిలీ చేసిన 49 మంది మేనేజర్లలో సగానికి పైగా పాత స్థానాలను వదలకుండా అక్కడే కొనసాగుతున్నారు.


సెక్షన్లు ఖాళీగా ఉన్నా.. మేనేజర్ల నియామకం లేదు

నగరంలోని పలు డివిజన్లలో సెక్షన్లకు మేనేజర్లే లేరు. దీంతో ఆయా ప్రాంతాల్లో సమస్యలు వచ్చినప్పుడు స్పందించేవారు లేక స్థానికులకు సమస్యలు తప్పడం లేదు. పాతబస్తీలో మాదన్నపేట, సంతోష్‏నగర్‌, ముసారంబాగ్‌ సెక్షన్లు ఖాళీగా ఉన్నాయి. అక్కడ మేనేజర్లు లేరు. తమకు అనుకూలంగా ఉన్న మేనేజర్లకు స్థానిక జీఎంలు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. బండ్లగూడ, జంగమ్మెట్‌ సెక్షన్లలో కూడా మేనేజర్లకు దిక్కులేదు. ఇదే తరహాలో హఫీజ్‌పేట డివిజన్‌, సికింద్రాబాద్‌, నారాయణగూడ, ఎల్‌బీనగర్‌(Secunderabad, Narayanguda, LB Nagar), నిజాంపేట, ఉప్పల్‌, ఎస్‌ఆర్‌నగర్‌, మణికొండ డివిజన్లలో పలు సెక్షన్లు మేనేజర్లు లేక ఖాళీగా ఉన్నాయి. వివిధ డివిజన్లలో టెక్నికల్‌ ఆఫీసర్‌గా ఉండే మేనేజర్లకు కూడా క్షేత్రస్థాయిలో ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ పనులు అప్పగిస్తున్నారు. సర్దుబాటు చేసే పనిలో భాగంగా కొన్నిచోట్ల బదిలీలు చేపట్టినా అధికారులు కదలడం లేదు. రాజకీయ ఒత్తిళ్లతో ఉన్నతాధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నట్లు స్పష్టమవుతున్నది.


ఇదికూడా చదవండి: సాగర్‌ నీటి విడుదలకు మా సమ్మతి అక్కర్లేదా?

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 27 , 2024 | 10:23 AM