Share News

Hyderabad: ఐటీ కంపెనీల భవనాలకు హై రైజ్‌ కెమెరాలు..

ABN , Publish Date - Aug 09 , 2024 | 08:53 AM

సైబరాబాద్‌ కమిషనరేట్‌(Cyberabad Commissionerate) పరిధిలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఎస్సీఎస్సీ) సంయుక్త ఆధ్వర్యంలో ఐటీ కంపెనీల భవనాలకు హై రైజ్‌ కెమెరాల ఏర్పాటు కు ప్రణాళికలు సిద్ధం చేశారు.

Hyderabad: ఐటీ కంపెనీల భవనాలకు హై రైజ్‌ కెమెరాలు..

- ట్రాఫిక్‌ నియంత్రణకు సరికొత్త ప్రయోగం

- సైబరాబాద్‌లో 70 ప్రాంతాలను గుర్తించిన అధికారులు

- కమాండ్‌ కంట్రోల్‌ నుంచి మానిటరింగ్‌

- ఎక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అయినా.. తక్షణమే రంగంలోకి..

- ఇప్పటికే 17 చోట్ల దారికొస్తున్న ట్రాఫిక్‌

హైదరాబాద్‌ సిటీ: సైబరాబాద్‌ కమిషనరేట్‌(Cyberabad Commissionerate) పరిధిలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఎస్సీఎస్సీ) సంయుక్త ఆధ్వర్యంలో ఐటీ కంపెనీల భవనాలకు హై రైజ్‌ కెమెరాల ఏర్పాటు కు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మాకూ మెట్రో కావాలి..!


ఒక్కో కెమెరా కిలోమీటర్‌ విజువల్స్‌తో..

ఒక్కో హైరైజ్‌ కెమెరా 360 డిగ్రీస్‌ కిలోమీటరు రేడియస్‌లో స్పష్టమైన విజువల్స్‌ను వీక్షిస్తుంది. జూమ్‌చేసి వాహనాల నంబర్లతో సహా స్పష్టంగా చూడొచ్చు. ఆ చట్టుపక్కల ఎక్కడ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడినా పోలీసులకు తెలిసేలా కెమెరాలను సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని పబ్లిక్‌ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్‌ ఆపరేషన్‌ సెంటర్‌ (పీఎస్‌ ఐవోసీ)కు అనుసంధానం చేశారు. అక్కడి నుంచి సిబ్బంది ట్రాఫిక్‌ను మానిటరింగ్‌ చేస్తారు. ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ సైతం పరిస్థితిని సమీక్షించేలా ఆయన కార్యాలయానికి కనెక్ట్‌ చేశారు. ట్రాఫిక్‌ ఎక్కువగా ఎక్కడ జామ్‌ అయ్యింది ? ఎందుకు జామ్‌ అయ్యింది ? పరిస్థితిని వీక్షించి వెంటనే ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలను రంగంలోకి దింపుతారు. ట్రాఫిక్‌ క్లియర్‌ చేయడానికి అవసరమైన చర్యలు చేపడతారు.


అంతేకాదు.. రోజూ ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడే ప్రాంతాలను గుర్తించి అక్కడ మరోసారి సమస్యలు తలెత్తకుండా ప్రత్నామ్నాయ మార్గాలను అన్వేషిస్తారు. ఇలా ఐటీ కారిడార్‌లో గచ్చిబౌలి, బొటానికల్‌ గార్డెన్‌, రాయదుర్గం, ఐకియా, నార్సింగి, సన్‌సిటీ, రాజేంద్రనగర్‌(Narsinghi, Suncity, Rajendranagar), అత్తాపూర్‌, మాదాపూర్‌, మియాపూర్‌, చందానగర్‌, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, బాచుపల్లి, దుండిగల్‌.. మొత్తం 70 ప్రాంతాల్లో హై రైజ్‌ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే 17 ప్రాంతాల్లో ఐటీ భవనాలకు కెమెరాలను ఇన్‌స్టాల్‌ చేసి ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేసినట్లు ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు.


చినుకు పడినా చింతలేకుండా..

గతంలో చినుకు పడిందంటే చాలు.. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించిపోయేది. 100 మీటర్ల దూరానికే 15-20 నిమిషాలు పట్టేది. రాంగ్‌రూట్‌లు, యూటర్న్‌లతో ట్రాఫిక్‌ మరింత జఠిలంగా మారేది. ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వర్షం వచ్చే సందర్భంలో ఎక్కడెక్కడ వాటర్‌ లాగింగ్‌ పాయింట్లు ఉన్నాయి? ఎక్కడెక్కడ ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడతాయి? ట్రాఫిక్‌ను ఎలా కంట్రోల్‌ చేయాలి? అనే కోణంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మొత్తం 120 వాటర్‌ లాగింగ్‌ పాయింట్లను గుర్తించారు.

city2.2.jpg


ఇదికూడా చదవండి: Sampath Kumar: పెట్టుబడులపై రాజకీయాలెందుకు?!

వర్ష సూచనలు ఉన్న సమయంలో ముందుగానే ట్రాఫిక్‌ సిబ్బందితోపాటు జీహెచ్‌ఎంసీ సిబ్బందిని రంగంలోకి దింపుతున్నారు. ఇంటిగ్రేటెడ్‌ ఆపరేషన్‌ సెంటర్‌లోని సిబ్బంది ఐటీ కారిడార్‌ మొత్తాన్ని వీక్షించి ఎక్కడ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడే అవకాశం ఉందో, అక్కడికి బృందాలను పంపుతున్నారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 09 , 2024 | 08:53 AM