Share News

Hyderabad: సీఎం సభ సందర్భంగా.. ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , Publish Date - Aug 02 , 2024 | 09:59 AM

ఇటీవల పదోన్నతులు పొందిన 25 వేల మంది టీచర్లతో సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) ఎల్‌బీస్టేడియంలో సభ నిర్వహిస్తున్న సందర్భంగా శుక్రవారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు సీపీ (ట్రాఫిక్‌) పి.విశ్వప్రసాద్‌(Additional CP (Traffic) P. Vishwaprasad) తెలిపారు.

Hyderabad: సీఎం సభ సందర్భంగా.. ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ సిటీ: ఇటీవల పదోన్నతులు పొందిన 25 వేల మంది టీచర్లతో సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) ఎల్‌బీస్టేడియంలో సభ నిర్వహిస్తున్న సందర్భంగా శుక్రవారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు సీపీ (ట్రాఫిక్‌) పి.విశ్వప్రసాద్‌(Additional CP (Traffic) P. Vishwaprasad) తెలిపారు. ఎల్‌బీస్టేడియం పరిసరాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ఆంక్షలుంటాయని అన్నారు.

ఇదికూడా చదవండి: GHMC: నలుగురు జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల అరెస్టు.. కారణం ఏంటంటే..


రద్దీని బట్టి ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిపివేయడం లేదా మళ్లించడం జరుగుతుందన్నారు. పబ్లిక్‌ గార్డెన్‌ వైపు నుంచి పీజేఆర్‌ విగ్రహం వైపు వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ పంపు నుంచి నాంపల్లి వైపు పంపుతారు. బషీర్‌బాగ్‌ నుంచి ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌వైపు వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను బీజేఆర్‌ విగ్రహం నుంచి ఆబిడ్స్‌ వైపు పంపుతారు. సుజాత స్కూల్‌(Sujata School) వైపు నుంచి ఖాన్‌లతీఫ్‌ ఖాన్‌ బిల్డింగ్‌ వైపు వాహనాలను అనుమతించరు.


ఈ వాహనాలను ఆబిడ్స్‌ వైపు పంపుతారు. ఎల్‌బీస్టేడియం పరిసరాల్లో ఉన్న వీవీ విగ్రహం, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌(Khairatabad Flyover), అంబేడ్కర్‌ విగ్రహం, ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ, ఆబిడ్స్‌ సర్కిల్‌, నాంపల్లి, లిబర్టీ(Nampally, Liberty), అసెంబ్లీ, ఎంజేమార్కెట్‌ వద్ద వాహనాలను మళ్లిస్తామని విశ్వప్రసాద్‌ తెలిపారు. వాహనదారులు ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని కోరారు.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 02 , 2024 | 09:59 AM