Share News

Hyderabad: పాతబస్తీలో అమిత్ షాపై కేసు.. ఉపసంహరించుకున్న పోలీసులు

ABN , Publish Date - Jul 06 , 2024 | 02:31 PM

ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘించారనే కారణంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah)పై నమోదైన కేసును శనివారం చార్మినార్ పరిధిలోని మొఘల్ పురా పోలీసులు ఉపసంహరించారు.

Hyderabad: పాతబస్తీలో అమిత్ షాపై కేసు.. ఉపసంహరించుకున్న పోలీసులు

హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘించారనే కారణంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah)పై నమోదైన కేసును శనివారం చార్మినార్ పరిధిలోని మొఘల్ పురా పోలీసులు ఉపసంహరించారు. ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘన జరగలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వివరించారు.

అసలేం జరిగిందంటే..

మే 1వ తేదీన పాతబస్తీలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతకు మద్దతుగా అమిత్ షా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో మాధవి లత మాట్లాడుతుండగా.. వేదికపైకి ఇద్దరు బాలికలు వచ్చారు.

అమిత్ షా ఆ చిన్నారులను తన వద్దకు రమ్మంటూ సైగ చేయడంతో.. ఆ చిన్నారులు షా వద్దకు వెళ్లారు. ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్‌పై కమలం పువ్వు గుర్తు.. మరో ఇద్దరు చిన్నారుల చేతిలో ఆప్ కీ బార్ 400 సీట్లు అనే ప్లకార్డ్స్ ఉన్నాయి.


ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్నికల నియమాలను ఉల్లంఘించారంటూ బీజేపీ నేతలపై కాంగ్రెస్ పార్టీ పీసీసీ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన ఈసీ.. విచారణ జరపాలంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మొఘల్ పుర పీఎస్‌లో సెక్షన్ 188 ఐపీసీ క్రింద కేసు నమోదు చేశారు పోలీసులు. A1 - యమాన్ సింగ్, A2 - హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవి లత, A3 - కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, A4 - రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, A5 -MLA రాజసింగ్ తో పాటు పలువురి పై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు కొట్టివేశారు.

For Latest News and National News click here

Updated Date - Jul 06 , 2024 | 02:31 PM