Share News

Hyderabad: రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , Publish Date - Sep 27 , 2024 | 08:51 AM

నగరానికి ఈనెల 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) రానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్‌, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు.

Hyderabad: రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

- ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్‌ అనుదీప్‌

హైదరాబాద్‌ సిటీ: నగరానికి ఈనెల 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) రానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్‌, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. రోడ్లపై ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రత ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. అనంతరం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన 8 రాష్ర్టాలకు సంబంధించిన స్టాళ్లను, 4ఫుడ్‌ కోర్టులు, మీడియా సెంటర్‌, ఇతర స్టాళ్లను పరిశీలించారు.

ఇదికూడా చదవండి: Minister Thummala: అక్రమ నిర్మాణాలపై చర్యలు.. మంత్రి తుమ్మల షాకింగ్ కామెంట్స్


ట్రాఫిక్‌ ఆంక్షలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా శనివారం నగరంలోని పలుప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని అడిషనల్‌ సీపీ ట్రాఫిక్‌ విశ్వప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28 ఉదయం 9 గంటల నుంచి బేగంపేట(Begumpet), హెచ్‌పీఎస్‌, పీఎన్‌టీ జంక్షన్‌, రసూల్‌పురా, సీటీఓ, ప్లాజా, తివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులుంటాయని తెలిపారు.


నల్సార్‌ 21వ స్నాతకోత్సవం..

శామీర్‌పేట(హైదరాబాద్): మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పరిధిలోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయ 21వ స్నాతకోత్సవం 28న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) హాజరవుతున్నారు. గౌరవ అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ, నల్సార్‌ చాన్స్‌లర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాధే, అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నర్సింహులు విచ్చేస్తున్నట్లు విశ్వవిద్యాలయ వీసీ క్రిష్ణదేవరావ్‌ గురువారం మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. స్నాతకోత్సవ ఏర్పాట్లను గురువారం సంబంధిత ప్రభుత్వ అధికారులు, పోలీసులు పర్యవేక్షించారు.


.......................................................

ఈ వార్తను కూడా చదవండి:

.......................................................

CP CV Anand: డీజే సౌండ్‌ను కట్టడి చేయండి..

- శృతిమించితే కఠిన చర్యలు: సీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌ సిటీ: మతపరమైన కార్యక్రమాలు, ర్యాలీల్లో డీజే శబ్దాలు, బాణాసంచా శబ్దాలు శృతి మించుతున్నాయని, వీటిని వెంటనే కట్టడి చేయాలని సీపీ సీవీ ఆనంద్‌(CP CV Anand) సూచించారు. మతపరమైన ర్యాలీల్లో డీజేలు, టపాసుల వినియోగంపై కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో గురువారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ ఆనంద్‌ మాట్లాడుతూ.. ర్యాలీల్లో నిబంధనలు పాటించకుండా డీజేలతో అధిక శబ్దం సృష్టిస్తున్నారని తెలిపారు. ఫలితంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసుల వైర్‌లెస్‏లు పనిచేయడం లేదని, వారిలో అనారోగ్య సమస్యలు సైతం వస్తున్నట్లు గుర్తించామని సీపీ తెలిపారు. గణేష్‌ ఉత్సవాలతో పాటు, మిలాదున్‌ నబీ సమయంలో కూడా డీజేల వినియోగం భారీగా పెరిగిందన్నారు.

city1.jpg


దీని కారణంగా పిల్లలు, వృద్ధులు, రోగులు చాలా ఇబ్బందులు పడినట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. డీజేలను కట్టడి చేయడం కోసం అన్ని వర్గాల వారి అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. నిబంధనలు పాటించకుండా డీజేలు పెట్టిన వారిపై, బాణాసంచా కాల్చి ఇబ్బందులకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీపీ హెచ్చరించారు. ఈ సమావేశానికి సైబరాబాద్‌, రాచకొండ కమిషనర్‌లతో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, ఎంఎంఐ ఎమ్మెల్యేలు పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు.


ఇదికూడా చదవండి: Harish Rao: పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులివ్వండి

ఇదికూడా చదవండి: కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకోకండి

ఇదికూడా చదవండి: KCR: కొండా లక్ష్మణ్‌ బాపూజీ కృషి అజరామరం

ఇదికూడా చదవండి: అబ్బో.. వీళ్ల పైత్యం మామూలుగా లేదుగా.. మెట్రోరైల్వేస్టేషన్‌లో అశ్లీల రీల్స్‌..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 27 , 2024 | 08:53 AM