Share News

Hyderabad: స్మితాసబర్వాల్‌ క్షమాపణ చెప్పాలి...

ABN , Publish Date - Jul 25 , 2024 | 10:54 AM

సివిల్‌ సర్వీస్‌లలో దివ్యాంగుల కోటాపై చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్‌ అధికారి స్మితాసబర్వాల్‌(IAS officer Smithasabarwal) ఉపసంహరించుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు.

Hyderabad: స్మితాసబర్వాల్‌ క్షమాపణ చెప్పాలి...

హైదరాబాద్: సివిల్‌ సర్వీస్‌లలో దివ్యాంగుల కోటాపై చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్‌ అధికారి స్మితాసబర్వాల్‌(IAS officer Smithasabarwal) ఉపసంహరించుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ దివ్యాంగుల విభాగం జాతీయ అధ్యక్షురాలు ఎస్‌ఎన్‌ ఉదయలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు కె.బి.శ్రీధర్‌, నేషనల్‌ పొలిటికల్‌ జస్టిస్‌ ఫ్రంట్‌ వీజీఆర్‌ నారగోని తదితరులు మాట్లాడారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితాసబర్వాల్‌(Senior IAS officer Smithasabarwal) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆమె వ్యాఖ్యలపై వ్యతిరేకత వస్తున్నా, తప్పు ఒప్పుకోకపోగా, వాటిని కొనసాగించడం బాధాకరమని అన్నారు. ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్రపతి, గవర్నర్‌లకు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు చెరుకు నాగభూషణం, భాస్కర్‌, శారద, శ్రీనివాస్‌, కిరణ్‌, పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: రవాణా శాఖలో స్క్రాప్‌ దందా.. స్క్రాప్‌ చేయకుండానే చేసినట్లు సర్టిఫికెట్‌


స్మితాసబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలి

city3.jpg

హైదరాబాద్: సివిల్‌ సర్వీస్‌లలో దివ్యాంగుల కోటాపై వాఖ్యానించిన స్మితాసబర్వాల్‌(Smithasabarwal)పై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ దివ్యాంగుల సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌(Bashirbagh Press Club)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ దివ్యాంగుల జేఏసీ కన్వీనర్‌ డాక్టర్‌ నారా నాగేశ్వర్‌రావు, అఖిల భారత దివ్యాంగుల ఐక్య వేదిక అధ్యక్షుడు పల్లెబోయిన సుధాకర్‌ వర్మ, ఫెండ్లీ ఎన్విరాన్‌మెంట్‌ ఫర్‌ ది డిసెబుల్డ్‌ చైర్మన్‌ ఎం.గంగారాం, దివ్యాంగుల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కొమురయ్య, దివ్యాంగుల మహిళా సాధికారిత సంఘం అధ్యక్షురాలు కె.రాజ్యలక్ష్మి మాట్లాడారు. దివ్యాంగులపై స్మితాసబర్వాల్‌ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు, హైకోర్టులు సుమోటోగా తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌, ఐఏఎస్‌ ఆఫీసర్ల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు దీనిపై స్పందించాలని వారు డిమాండ్‌ చేశారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 25 , 2024 | 10:57 AM