Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో డ్రోన్‌తో స్ప్రే..
ABN , Publish Date - Nov 30 , 2024 | 07:31 AM
హుస్సేన్‌సాగర్(Hussain Sagar) నుంచి దుర్వాసన రాకుండా శుక్రవారం డ్రోన్‌తో స్ప్రే కొట్టారు. కూకట్‌పల్లి(Kukatpally) నాలా నుంచి హుస్సేన్‌సాగర్‌లోకి వ్యర్థాలు చేరే ప్రాంతాల్లో పెద్దఎత్తున పూడిక చేరగా తొలగింపు ప్రక్రియ సాగుతోంది. వ్యర్థాలను యంత్రాలతో తొలగిస్తుండగా పెద్దఎత్తున దుర్వాసన వస్తోంది.
హైదరాబాద్ సిటీ: హుస్సేన్‌సాగర్(Hussain Sagar) నుంచి దుర్వాసన రాకుండా శుక్రవారం డ్రోన్‌తో స్ప్రే కొట్టారు. కూకట్‌పల్లి(Kukatpally) నాలా నుంచి హుస్సేన్‌సాగర్‌లోకి వ్యర్థాలు చేరే ప్రాంతాల్లో పెద్దఎత్తున పూడిక చేరగా తొలగింపు ప్రక్రియ సాగుతోంది. వ్యర్థాలను యంత్రాలతో తొలగిస్తుండగా పెద్దఎత్తున దుర్వాసన వస్తోంది. దుర్వాసన రాకుండా స్ర్పే చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతుండగా.. ఓ కంపెనీ డ్రోన్‌తో స్ర్పే చేసేందుకు ట్రయల్ రన్ నిర్వహించేందుకు ముందుకొచ్చింది. జీహెచ్‌ఎంసీలోని ఎంటమాలజీ విభాగం అధికారులు, హెచ్‌ఎండీఏ(HMDA)లోని బీపీపీఏ అధికారులు సంయుక్తంగా శుక్రవారం డ్రోన్‌తో స్ప్రే చేసే ప్రక్రియను ట్రయల్ రన్ నిర్వహించారు.
ఈ వార్తను కూడా చదవండి: Cyber criminals:: సైబర్ బాధితులకు రిక‘వర్రీ’
సంజీవయ్య పార్కు, లేక్‌వ్యూ పార్కు, ట్యాంక్‌బండ్ బతుకమ్మ ఘాట్ ప్రాంతాల్లో దాదాపు గంటకు పైగా డ్రోన్ ద్వారా స్ప్రే చేశారు. ఇప్పటికే హుస్సేన్‌సాగర్ నుంచి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు బీఓడీ స్థాయిలను తగ్గించి డీఓ స్థాయిలను పెంచేందుకు బెంగుళూరు(Bangalore)కు చెందిన కంపెనీ ద్వారా కొన్నేళ్లుగా చర్యలు చేపడుతోంది. ఈ కంపెనీ బుకాష్ బాల్స్ వేయడంతోపాటు ట్యాంకర్ ద్వారా వివిధ ప్రాంతాల్లో స్ర్పే చేస్తోంది. తాజాగా డ్రోన్‌తో స్ప్రే చేసే ప్రక్రియ సత్ఫలితాలిస్తే మున్ముందు హుస్సేన్‌సాగర్‌లో అమలు చేసేందుకు అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది.
ఈవార్తను కూడా చదవండి: మూడు జిల్లాల్లో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
ఈవార్తను కూడా చదవండి: పోటీపై అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం
ఈవార్తను కూడా చదవండి: రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.141.84 కోట్లు
ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌పై హరీష్ విసుర్లు
Read Latest Telangana News and National News