Share News

Hyderabad: టార్గెట్ 1:30 pm.. ఆ సమయానికల్లా..

ABN , Publish Date - Sep 14 , 2024 | 12:37 PM

గణేశ్‌ శోభాయాత్ర(Ganesh Shobhayatra)ను నగరవాసులు, భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌(Hyderabad City Police Commissioner) సిబ్బందిని ఆదేశించారు.

Hyderabad: టార్గెట్ 1:30 pm.. ఆ సమయానికల్లా..

- ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జనం

- ఈ ఏడాది సుమారు లక్ష విగ్రహాలు

- గతేడాది కన్నా 10 శాతం ఎక్కువే

- సిటీలో 25 వేల మంది పోలీసులతో బందోబస్తు

- వెస్ట్‌జోన్‌ సిబ్బందితో సీపీ సమీక్ష

హైదరాబాద్‌ సిటీ: గణేశ్‌ శోభాయాత్ర(Ganesh Shobhayatra)ను నగరవాసులు, భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌(Hyderabad City Police Commissioner) సిబ్బందిని ఆదేశించారు. వెస్ట్‌జోన్‌లో శుక్రవారం పర్యటించిన ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌, టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌బీ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. గణేశ్‌ నిమజ్జనం మొత్తం క్రతువులో ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ నిమజ్జనం అత్యంత కీలకమన్నారు. ఆరోజు మధ్యాహ్నం 1:30కు మహాగణపతి నిమజ్జనం జరిగేలా చూడటమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. అనుకున్న సమయానికి బడా గణేషుని నిమజ్జనం జరిగితే.. పోలీసులు సక్సెస్‌ అయినట్లేనని అన్నారు.

ఇదికూడా చదవండి: Amrapali: చర్లపల్లి రైల్వే టర్మినల్‌ అప్రోచ్‌ రోడ్ల విస్తరణ..


బందోబస్తులో 25 వేల మంది పోలీసులు..

ఈనెల 17న సిటీ కమిషనరేట్‌ పరిధిలో గణేశ్‌ శోభాయాత్ర, నిమజ్జనానికి 25 వేల మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సీపీ వివరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది సిటీలో చిన్నవి, పెద్దవి కలిసి సుమారు లక్షవరకు విగ్రహాలు ఉన్నాయన్నారు. నాలుగు రోజులుగా హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనాలు జరుగుతున్నాయని, 17న వేల సంఖ్యలో నిమజ్జనాలు జరుగుతాయని చెప్పారు. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఐటీ సెల్‌ అధికారులు సీసీటీవీ కెమెరాలతో భద్రత, బందోబస్తును పర్యవేక్షిస్తారని ఆనంద్‌ వివరించారు.

city6.3.jpg


నిమజ్జనం రోజున నిబంధనలు..

- విగ్రహాలను తీసుకెళ్లడానికి అవసరమైన వాహనాలను ఉత్సవ కమిటీ సభ్యులు ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి.

- సౌత్‌జోన్‌ పరిధిలోని విగ్రహాలు ముందుగా బయలుదేరాలి.

- వాహనానికి ఏసీపీలు కేటాయించిన నంబర్‌ను ప్రదర్శించాలి.

- వాహనంపై లౌడ్‌స్పీకర్లు అమర్చకూడదు. డీజే సిస్టంకు అనుమతిలేదు.

- రంగులు చల్లుకునేందుకు కాన్ఫెట్టి తుపాకులు వినియోగించకూడదు.

- విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంలో మద్యంగానీ, ఇతర మత్తు పదార్థాలుగానీ ఉండకూడదు.


- ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా వాహనాలు క్రమపద్ధతిలో వెళ్లాలి.

- శోభాయాత్ర, ఊరేగింపులలో కత్తులు, కర్రలు, మారణాయుధాలు వినియోగించకూడదు. జెండాల కోసం 2 అడుగులకు మించిన కర్రలు వాడరాదు. బాణాసంచా కాల్చడం నిషేధం.

- కుంకుమ, ఇతర ఏమైనా పౌడర్లను సాధారణప్రజలపై భక్తులు చల్లకూడదు.

- ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా రెచ్చగొట్టే మాటలు, ప్రసంగాలు, నినాదాలు చేయకూడదు.

- ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, అత్యవసర పరిస్థితి ఏర్పడినా డయల్‌-100కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలి.


విద్యుత్‌శాఖ సిద్ధం...

శోభాయాత్రకు విద్యుత్‌ శాఖ సిద్ధంగా ఉందని, ఈమేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ తగిన చర్యలు చేపట్టిందని సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ తెలిపారు. ఎన్టీఆర్‌మార్గ్‌, ట్యాంక్‌బండ్‌లో టీజీఎస్పీడీసీఎల్‌ కంట్రోల్‌రూంలను సీఎండీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనాలు చేపట్టే అన్ని ప్రాంతాల్లో విద్యుత్‌శాఖ లోడ్‌కు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసిందన్నారు. విద్యుత్‌ సరఫరా, నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి డైరెక్టర్లు, చీఫ్‌ ఇంజనీర్లను ఇంచార్జి అధికారులుగా నియమించినట్లు తెలిపారు. విద్యుత్‌ శాఖ ప్రత్యేక కంట్రోల్‌రూంతో పాటు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన జాయింట్‌ కంట్రోల్‌రూంలలో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్‌ రూం నంబర్‌ (100/1912)కు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో సెంట్రల్‌ ఎస్‌ఈ వెంకన్న, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం గచ్చిబౌలి నుంచి కొండాపూర్‌ మార్గంలో మాస్టర్‌ప్లాన్‌ వింగ్‌ విద్యుత్‌శాఖ చేపడుతున్న లైన్‌ షిఫ్టింగ్‌ పనులను సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ శుక్రవారం పరిశీలించారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 14 , 2024 | 12:38 PM