Share News

CM Revanth: పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం

ABN , Publish Date - Jul 26 , 2024 | 08:14 PM

తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు త్వరలోనే న‌గారా మోగ‌నుంది. మరికొన్ని రోజుల్లోనే ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేయడానికి ముహుర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటివారంలోగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సూచించారు.

CM Revanth: పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
CM Revanth Reddy,

హైద‌రాబాద్: తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు త్వరలోనే న‌గారా మోగ‌నుంది. మరికొన్ని రోజుల్లోనే ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముహుర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. పంచాయితీ రాజ్ ఎన్నికలు , కార్యాచరణపై శుక్రవారం నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స‌చివాల‌యంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పంచాయతీ ఎన్నికలు జరపాలని నిర్ణయించారు.


పంచాయతీరాజ్‌పై ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్‌కు సూచించారు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే ఐదేళ్ల క్రితం ఎన్నిక‌ల్లో కేటాయించిన‌ రిజ‌ర్వేష‌న్ల ప్రకారమే ఎన్నిక‌లు నిర్వహించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన‌ట్లు స‌మాచారం. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీమంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభారణం కృష్ణ మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.


మరోవైపు తెలంగాణలో మళ్లీ లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మీడియాకు ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. శుక్రవారం నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స‌చివాల‌యంలో విధివిధానాలు ఖరారు కోసం మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇత‌ర ఉన్నతాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Updated Date - Jul 26 , 2024 | 08:20 PM