Share News

Ganesh Immersion: భారీగా నిలిచిపోయిన వినాయక విగ్రహాలు.. ఎంత వరకు బారులు తీరాయో తెలుసా..

ABN , Publish Date - Sep 18 , 2024 | 09:32 AM

Telangana: ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా వినాయక విగ్రహాలు నిలిచిపోయాయి. బషీర్ బాగ్ బాబు జగ్జీవన్ రావు విగ్రహం వరకు గణనాథులు నిలిచిపోయాయి. బర్కత్‌పుర ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు వినాయక విగ్రహాలు బారులు తీరాయి.

Ganesh Immersion: భారీగా నిలిచిపోయిన వినాయక విగ్రహాలు.. ఎంత వరకు బారులు తీరాయో తెలుసా..
Ganesh immersion

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనాలు (Ganesh Immersion) రెండో రోజు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా వినాయక విగ్రహాలు నిలిచిపోయాయి. బషీర్ బాగ్ బాబు జగ్జీవన్ రావు విగ్రహం వరకు గణనాథులు (Ganesh Idols) నిలిచిపోయాయి. బర్కత్‌పుర ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు వినాయక విగ్రహాలు బారులు తీరాయి. మరో గంటలోగా సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నారాయణగూడ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే గణనాథులను వన్ వేలో అధికారులు అనుమతించారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి.

Viral Video: ఒక్క రూపాయితో ఉద్యోగాన్ని ఊడగొట్టుకున్న ఉద్యోగి


నిమజ్జనం కోసం అర్ధరాత్రి నుంచి వినాయక విగ్రహాలు బారులు తీరాయి. ఈరోజు మధ్యాహ్నంలోపు గణేష్ నిమజ్జనాలు పూర్తికానున్నాయి. ఇప్పటివరకు 1లక్ష 3500 గణనాధులు నిమజ్జనం అయ్యాయి. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546 గణనాథుల నిమజ్జనం జరిగింది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గం వద్ద 4730, నెక్లెస్ రోడ్ 2360, పీపుల్స్ ప్లాజా 5500, అల్వాల్ కొత్తచెరువులో 6221 వినాయకులను అధికారులు నిమజ్జనం చేశారు. గ్రేటర్‌లో మొత్తంలో 71 ప్రాంతాల్లో నిమజ్జనాల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.


మరోవైపు ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన కోలాహలం కొనసాగుతోంది. మధ్యాహ్నం లోపు మరో 5 వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. సాంకేతిక కారణాలతో పీపుల్స్ వద్ద క్రేన్లు మోరాయిస్తున్న పరిస్థితి. పీవీ మార్గ్, పీపుల్స్ ప్లాజా వద్ద నిమజ్జన ప్రక్రియ ఆలస్యంగా కొనసాగుతోంది. సెక్రెటేరియట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, టెలిఫోన్ భవన్, లక్డికాపూల్ వరకు నిమజ్జనం కోసం విగ్రహాలు బారులు తీరాయి.


జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ..

జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి నిమజ్జన ప్రక్రియను పరిశీలిస్తున్నారు. బల్దియా కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గణేష్ నిమజ్జనాన్ని మధ్యాహ్నంలోపు పూర్తిచేసేలా బల్దియా టార్గెట్‌గా పెట్టుకుంది. సాంకేతిక కారణాలతో మోరాయిస్తున్న క్రేన్ల స్థానంలో తక్షణమే వేరే క్రేన్లను ఏర్పాటు అయ్యేలా చూస్తున్నారు. అలాగే అత్యాధునికమైన యంత్రాలతో హుస్సేన్ సాగర్ క్లీనింగ్ పనులు మొదలయ్యాయి. దాదాపు 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో హుస్సేన్ సాగర్ చుట్టూ జీహెచ్ఎంసీ క్లీనింగ్ పనులు చేపట్టింది.

Pagers: పేజర్లతో పేలుడు విధ్వంసం.. పేజర్ అంటే ఏంటి, వీటి వాడకం ఎక్కడ


స్వయంగా రంగంలోకి సీపీ...

కాగా.. వినాయక నిమజ్జనాలు ఆలస్యం అవుతుండటంతో పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా రంగంలోకి దిగారు. మోజంజాహి మార్కెట్ వద్దకు సీపీ చేరుకున్నారు. మోజంజాహి కూడలి మూడు మార్గాల్లో భారీగా గణనాథులు బారులు తీరాయి. పోలీస్ అధికారులు గణపతులను వేగంగా నిమజ్జనాలకు పంపుతున్నారు. నిన్న మంగళవారం కావడంతో అర్థరాత్రి దాటిన తర్వాత వినాయకులను నిమజ్జనాలకు భక్తులు తరలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

PM Modi US Tour: ప్రధాని మోదీని కలుస్తా: డొనాల్డ్ ట్రంప్

Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు కీలక అప్‌డేట్.. మరికొద్దిసేపట్లో..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 18 , 2024 | 10:04 AM