Share News

Cheater Arrested: న్యూడ్ కాల్స్ చేసి బెదిరింపులు.. వీఐపీలే టార్గెట్‌గా రూ.లక్షలు వసూలు

ABN , Publish Date - Sep 19 , 2024 | 07:21 PM

ప్రముఖులకు వలపువల విసిరి న్యూడ్ కాల్స్ పేరుతో లక్షలు వసూలు చేస్తున్న ఓ చీటర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిల గొంతు మార్చి మాట్లాడి.. ప్రముఖులకు వల విసిరేవాడని పోలీసులు వెల్లడించారు.

Cheater Arrested: న్యూడ్ కాల్స్ చేసి బెదిరింపులు.. వీఐపీలే టార్గెట్‌గా రూ.లక్షలు వసూలు

హైదరాబాద్: ప్రముఖులకు వలపువల విసిరి న్యూడ్ కాల్స్ పేరుతో లక్షలు వసూలు చేస్తున్న ఓ చీటర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిలా గొంతు మార్చి మాట్లాడి.. ప్రముఖులకు వల విసిరేవాడని పోలీసులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రిధి బేడి అనే ఒక కేడీగాడు మహిళలా న్యూడ్ వీడియో కాల్స్ చేసి మాజీ ఐపీఎస్ అధికారిని బెదిరించి రూ.లక్షలు వసూలు చేశాడు. అమెరికాలో మెకానికల్ ఇంజనీర్ గా ఆరేళ్లపాటు పనిచేసిన రిధి బేడి డబ్బులు సులువుగా సంపాదించాలని న్యూడ్ వీడియో కాల్స్‌తో మోసగించడడం మొదలు పెట్టాడు.

అతని ప్రధాన టార్గెట్ వీఐపీలే కావడం గమనార్హం. వారిని లక్ష్యంగా చేసుకుని తొలుత న్యూడ్ కాల్ వస్తుంది. ఇరువురు మాట్లాడుతున్న క్రమంలో వీడియో కాల్ సంభాషణ అంతా.. రికార్డు చేసి బెదిరించడం మొదలు పెట్టేవాడు. అతను దుబాయిలో స్థిరపడ్డాడు. అయినా భారతీయులనే లక్ష్యంగా చేసుకుని ఫ్రాడ్ దందాకు తెరతీశాడు. అమ్మాయి గొంతుతో ముందుగా వీఐపీలని ట్రాప్ చేస్తున్న రిధి బెడి, వారిని బుట్టలో వేసుకుని న్యూడ్ కాల్స్ చేయించుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు.


న్యూడ్ వీడియో కాల్స్ ని స్క్రీన్ రికార్డ్ చేసి రిధి బేడి బెదిరించడం. మొదలు పెట్టేవాడని, న్యూడ్ వీడియో కాల్స్ ని సోషల్ మీడియాలో పెడతాను అంటూ బెదిరించేవాడని.. అలా చేయకుండా ఉండేందుకు లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు తేలింది. అలా ఇప్పటివరకు దుబాయి సహా ఇండియాలో ప్రముఖుల దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఎట్టకేలకు మోసగాడి బాగోతం బయటపడింది. మాజీ ఐపీఎస్ అధికారిని బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు అందింది. దాని ప్రకారం ట్రాక్ చేయగా.. రిధి బేడి విషయం బయటకొచ్చింది. సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని వెతికి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు.. మోసపోయిన వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. దీంతోపాటు నిందితుడికి ఇతర దేశాలతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు ప్రశ్నించనున్నారు.

Also Read:

రైతుల పోరుబాటతో కాంగ్రెస్ వెన్నులో వణుకు..

పిల్లలను నలుగురిలో తిడితే జరిగేది ఇదే..

తిరుమల లడ్డూపై సీఎం చెప్పినవన్నీ నిజాలే...

For MoreNational NewsandTelugu News

Updated Date - Sep 19 , 2024 | 07:23 PM