Share News

Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు..

ABN , Publish Date - Sep 28 , 2024 | 01:53 PM

జానీ మాస్టర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈనెల 25వ తేదీన జానీ మాస్టర్‌ను కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. శనివారంతో కోర్టు విధించిన గడువు ముగియడంతో ఆయనను జడ్జి ముందు హాజరుపర్చారు. పోలీసులు మరోసారి కస్టడీ కోరకపోవడంతో ఆయకు జ్యూడిషియల్ రిమాండ్‌ను కొనసాగిస్తూ ..

Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు..
Jani Master

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తన వద్ద పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొటున్న జానీ మాస్టర్‌ నాలుగు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో ఆయనను నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపర్చారు. దీంతో వచ్చే నెల 3వ తేదీవరకు జానీ మాస్టర్‌కు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జానీ మాస్టర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈనెల 25వ తేదీన జానీ మాస్టర్‌ను కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. శనివారంతో కోర్టు విధించిన గడువు ముగియడంతో ఆయనను జడ్జి ముందు హాజరుపర్చారు. పోలీసులు మరోసారి కస్టడీ కోరకపోవడంతో ఆయకు జ్యూడిషియల్ రిమాండ్‌ను కొనసాగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 3వ తేదీన ఆయనను మరోసారి కోర్టులో హాజరుపరుస్తారు. పోలీసు కస్టడీలో జానీ మాస్టర్‌ను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఆరోపణలు చేసిన యువతిలో ఎలాంటి సబంధం కలిగి ఉన్నారు. ఆమెతో ఎలా పరిచయం ఏర్పడిందనే దానిపై వివిధ కోణాల్లో విచారించినట్లు తెలుస్తోంది. బాధితురాలి నుంచి పోలీసులు సేకరించిన ఆధారాలను జానీ ముందు పెట్టి విచారించారు. మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.

Gandipet Reservoir: మరో రెండు గేట్ల ఎత్తివేత..


పోలీసుల విచారణలో..

పోలీసు విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పారన్నది ఆసక్తికరంగా మారింది. జానీ మాస్టర్ రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు విస్తుపోయే విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. దురుద్దేశంతోనే బాధితురాలిని అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా తీసుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆమెకు ఒక ప్రముఖ డ్యాన్స్‌ షోలో పాల్గొనే అవకాశం రావడంతో 2017లో నగరానికి వచ్చిందని.. తర్వాత జానీ మాస్టర్‌ వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా చేరిందని పేర్కొన్నారు. 2019 డిసెంబరు 15 నుంచి జానీ మాస్టర్‌ వద్దే పనిచేస్తూ అల్కాపురికాలనీలో ఉంటోందని, ఆ సమయంలో ఇద్దరూ ఒక సూపర్‌హిట్‌ సినిమాకు పనిచేశారని ప్రస్తావించారు. ఆ సినిమా పని నిమిత్తం 2020 జనవరి 10న జానీ మాస్టర్‌, బాధితురాలు, మరో ఇద్దరు సహాయకులు ముంబైకి వెళ్లారన్నారు. ఆ రోజు రాత్రి 12 గంటలకు బాధితురాలిని ఆధార్‌కార్డు, ఇతర డాక్యుమెంట్లు తీసుకొని తన గదికి రావాలని ఆదేశించారని, ఆమె గదిలోకి రాగానే గడియపెట్టి అత్యాచారం చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే. అప్పటికీ బాలిక వయసు 16 సంవత్సరాలని రిమాండ్‌ రిపోర్టులో తెలిపారు.

Viral Video: వామ్మో.. ఇదెక్కడి సర్‌ప్రైజ్ రా బాబూ.. బర్త్‌డే విషెస్ పేరుతో ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్‌కు నిప్పు.. తర్వాతేం జరిగిందంటే..


బాధిత యువతిపై ఫిర్యాదు

అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువతిపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. జానీమాస్టర్‌పై ఫిర్యాదు చేసిన బాధితురాలిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్‌గా పని చేయడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసిందని తెలిపింది. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే తనకు చూపించిందని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.


Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ

Indian Railways: పండుగల రద్దీ దృష్ట్యా 6 వేల ప్రత్యేక రైళ్లు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 28 , 2024 | 03:23 PM