CV Anand: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: కొత్వాల్ సీవీ ఆనంద్
ABN , Publish Date - Oct 25 , 2024 | 07:27 AM
ఇటీవల నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగిన ఉద్రిక్తతను హైదరాబాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ సమీక్షించారు. కొద్ది రోజుల క్రితం మహ్మద్ మజీద్ హుస్సేన్ తన అనుచరులతో కలిసి ఫిరోజ్ గాంధీ నగర్‌లో సిసి రోడ్డుకు సంబంధించిన సివిల్ పనులను పరిశీలించేందుకు వెళ్లారు. అదే సమయంలో...
హైదరాబాద్: మహానగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ కొత్వాల్ (Hyderabad Kotwal) సీవీ ఆనంద్ (CV Anand) హెచ్చరించారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో (Magistrate Position) కార్యనిర్వాహక న్యాయస్థాన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో అందజేసిన సమాచారంపై ఆయన సమీక్షించారు. ఇటీవల నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగిన ఉద్రిక్తతను సమీక్షించారు. కొద్ది రోజుల క్రితం మహ్మద్ మజీద్ హుస్సేన్ (Mohammed Majeed Hussain) తన అనుచరులతో కలిసి ఫిరోజ్ గాంధీ నగర్‌లో సిసి రోడ్డుకు సంబంధించిన సివిల్ పనులను పరిశీలించేందుకు వెళ్లారు.
అదే సమయంలో, కాంగ్రెస్ (Congress) పార్టీకి చెందిన మహ్మద్ ఫిరోజ్ ఖాన్ (Mohammad Feroze Khan) కూడా తన అనుచరులతో అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు నాయకుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఇరువర్గాల అనుచరులు పరస్పర విరుద్ధంగా వ్యవహరించడం వలన ఆ ప్రాంతంలో ప్రజలలో భయాందోళనలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో అక్కడి శాంతి భద్రతలకు భంగం కలిగాయి. ఈ సంఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు హుమాయున్ నగర్ ఎస్‌హెచ్‌వో సమర్పించిన సమాచారాన్ని సీవీ ఆనంద్ సమీక్షించారు. ఎస్‌హెచ్‌వో నివేదిక ఆధారంగా, ఇరువర్గాల మధ్య తీవ్ర రాజకీయ వైరం ఉంది. వారి తప్పుడు చర్యలు భవిష్యత్తులో శాంతికి పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ సమాచారంపై విచారణ చేపట్టిన కమిషనర్ ఇరువర్గాల ప్రతినిధులను వ్యక్తిగతంగా పిలిచి వారి వాదనలు విన్నారు. ఇరువర్గాల నాయకులు వారి వాదనలు విన్న కమిషనర్, ఇలాంటి రెచ్చగొట్టే చర్యల నుండి దూరంగా ఉండాలని కఠినంగా హెచ్చరించారు.
కోర్టు విచారణ అనంతరం, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ కేసును తదుపరి విచారణకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం, ఎవరైనా వ్యక్తి లేదా సమూహం భవిష్యత్తులో శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉంటే, వారికి షరతులతో కూడిన బాండ్ అమలు చేయాల్సి వస్తుందని సీపీ వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీ ఆనంద్ నిర్ణయించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండటానికి ఇరువర్గాలపై నిఘా ఉంచాలని కొత్వాల్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కపోయాడు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News