Srinivasreddy: ఆ మాత్రం కేటీఆర్, కేసీఆర్‌కు తెలీదా
ABN , Publish Date - Oct 28 , 2024 | 04:54 PM
Telangana: జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని.. మీడియాలో కథనాలు మాత్రమే వచ్చాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరుండి ప్రచారం చేయించినట్లు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసినట్లుగా ఫామ్ హౌస్‌లో స్టింగ్, కోవర్ట్ ఆపరేషన్లు ఇప్పుడు జరగలేదన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 28: మంత్రిగా పని చేసిన కేటీఆర్‌కు (KTR) చట్టాలపైన కనీస పరిజ్ఞానం లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బావమరిదిని కాపాడుకోవడం కోసం కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పార్టీల్లో 6.5 లీటర్ల కంటే ఎక్కువ మద్యం ఉంటే ఎక్సైజ్ పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఉందన్నారు. 111 జీవోని అతిక్రమిస్తూ రాజ్ పాకాల జన్వాడలో ఇళ్లు ఎలా నిర్మించారని ప్రశ్నించారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌కు (Former CM KCR) వారెంట్ ఎలా ఇస్తారో తెలియదా అని అడిగారు.
Kollu Ravindra: చెల్లెలి ఆస్తి దోచుకున్న దుర్మార్గుడు జగన్
ఎక్సైజ్ పోలీసులు తనిఖీ చేయడానికి ఎలాంటి వారెంటు అవసరం లేదన్నారు. రేవ్ పార్టీ జరిగిందని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని.. మీడియాలో కథనాలు మాత్రమే వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరుండి ప్రచారం చేయించినట్లు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసినట్లుగా ఫామ్ హౌస్‌లో స్టింగ్, కోవర్ట్ ఆపరేషన్లు ఇప్పుడు జరగలేదన్నారు. జన్వాడ ఫామ్ హౌస్‌లో ఎలాంటి స్టింగ్ ఆపరేషన్ జరగలేదని స్పష్టం చేశారు. గతంలో జూబ్లీహిల్స్ హైలైఫ్ పబ్‌కు రాజ్ పాకాల యజమాని అని తెలిపారు. డ్రగ్స్ తీసుకునే జూబ్లీహిల్స్ గ్యాంగ్‌లో రాజ్ పాకాల సభ్యుడనే ప్రచారం ఉందన్నారు.
AP Govt: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు... ఆ జీవోలన్నీ అందుబాటులోకి..
గత ప్రభుత్వంలో జూబ్లీహిల్స్‌లో పబ్‌లకు అనుమతులు ఇప్పించింది రాజ్ పాకాలనే అని చెప్పుకొచ్చారు. డ్రగ్స్‌కు స్వర్గం అని చెప్పుకునే సన్ బర్న్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడానికి రాజ్ పాకాల ప్రయత్నించారన్నారు. పార్టీపైన రాజ్ పాకాల మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చి ఉంటే అనుమానాలు వచ్చేవి కావన్నారు. రాజ్ పాకాల తాను డ్రగ్స్ సేవించలేదని నిరూపించుకోవాలన్నారు. రాజ్ పాకాల వెంటనే పోలీసులకు లొంగిపోయి వివరణ ఇవ్వాలన్నారు. తనకు రాజ్ పాకాలనే కొకైన్ ఇచ్చాడని విజయ్ మద్దూరి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారని... ఇది చాలా సీరియస్ విషయమని చెప్పుకొచ్చారు. జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం బాంబ్ కాదు.. సెల్ఫ్ గోల్ అని స్పష్టం చేశారు. అసలు బాంబ్‌లు కాళేశ్వరం స్కామ్, విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, ఈడీ దాడులు, వాహలా లావాదేవీలు అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Vemula: కేసీఆర్ సూచించిన వారికి పీఏసీ చైర్మన్ ఇవ్వాలి
TG News: హైదరాబాద్‌లో ఫుడ్ పాయిజన్
Read Latest Telangana News And Telugu News