Share News

Raghurama: ఆ రోజు నా జీవితంలో మధురమైన క్షణాలు: రఘురామ

ABN , Publish Date - May 28 , 2024 | 10:39 AM

హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసారభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు.

Raghurama: ఆ రోజు నా జీవితంలో మధురమైన క్షణాలు: రఘురామ

హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసారభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి (NTR Jayanti) సందర్భంగా మంగళవారం ఉదయం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama Krishnamraju) హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘట్(NTR Ghat) వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం విజయం సాధించబోతోందని అన్నారు. ఏడు రోజుల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రాబోతోందని, తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తాను ఎన్టీఆర్ అభిమానినని అన్నారు. ‘1991 ప్రాంతంలో ఎన్టీఆర్‌ను కలసిన సందర్భం.. నా జీవితంలో మధురమైన క్షణాలు’ అని అన్నారు. ఎన్టీఆర్ మాదిరి మానవత్వం ఉన్న నేతలు శతాబ్దంలోనే లేరని కొనియాడారు.


రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది అతి పెద్ద స్థాయి అని, ఎన్టీఆర్‌కు కేంద్రం భారతరత్న ఇచ్చి గౌరవిస్తోందన్న నమ్మకముందని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంబేద్కర్, పూలే మాదిరి.. ఎన్టీఆర్ జయంతిని రెండు ప్రభుత్వాలు అధికారికంగా నిర్విహించాలని కోరారు. సంక్షేమ రంగానికి సృష్టికర్త ఎన్టీఆర్ అని రఘురామ వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్టీఆర్ స్పూర్తితో ముందుకు వెళతాం: పురందేశ్వరి

జగన్ సర్కార్ ఇందుకు మినహాయింపు..

చంద్రగిరిలో వైసీపీ గెలుపుపై అనుమానాలు..

సర్వేలు కూటమికి అనుకూలంగా ఉండడంతో..

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 28 , 2024 | 10:48 AM