Share News

TG Highcourt: పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. హైకోర్టు ఏం చెప్పిందంటే

ABN , Publish Date - Nov 20 , 2024 | 01:07 PM

Telangana: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అరెస్టు సమయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు తెలిపారు. హత్యాయత్నం కేస్ తప్ప మిగిలిన సెక్షన్‌లన్నీ 5 సంవత్సరాలలోపు శిక్ష పడేవే అని తెలిపారు.

TG Highcourt:  పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. హైకోర్టు ఏం చెప్పిందంటే
Telangana High Court

హైదరాబాద్, నవంబర్ 20: లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (BRS Former MLA Patnam Narender Reddy) వేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టులో (Telangana high court) విచారణ జరిగింది. నరేందర్ రెడ్డి తరపున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు ముగిసిన అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. అరెస్టు సమయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు తెలిపారు.

CM Revanth: రాజన్న సిరిసిల్ల జిల్లాపై సీఎం రేవంత్ వరాలజల్లు


హత్యాయత్నం కేస్ తప్ప మిగిలిన సెక్షన్‌లన్నీ 5 సంవత్సరాలలోపు శిక్ష పడేవే అని తెలిపారు. ఘటన జరిగిన రోజు సురేష్‌‌తో పట్నం నరేందర్ ఎన్ని కాల్స్ మాట్లాడారు హైకోర్ట్ ప్రశ్నించారు. 71 డేస్‌లో 84 కాల్స్ ఉన్నందుకు అరెస్ట్ చేయడం సరికాదని న్యాయవాది తెలిపారు. అరెస్టు విషయాన్ని కనీసం కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పులను కింది కోర్ట్ కనీసం పరిగణలోకి తీసుకోలేదని.. అరెస్ట్ గ్రౌండ్స్‌ను చూడకుండానే పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్ విధించారని తెలిపారు.


పట్నం నరేందర్ ది అక్రమ అరెస్ట్ అని న్యాయవాది వాదించారు. ఎక్కడ కూడా పోలీసులు లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో కాలేదన్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారన్నారు. 11వ తేదీ సంఘటన జరిగినప్పుడు నరేందర్ రెడ్డి అక్కడ లేరని.. సురేష్ అనే నిందితుడి కాల్ డేటా ఆధారంగా అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారన్నారు. 11వ తేదీ కేవలం ఒకే ఒక సారి సురేష్‌తో నరేందర్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పులను ఉల్లంఘించారని పిటిషనర్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు.


పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు ఇవే..

లగచర్ల ఘటనలో ప్రభుత్వాన్ని అస్థిర పరించేందుకు కుట్ర చేశారని తెలిపారు. కలెక్టర్ మీద, అధికారుల మీద దాడులు చేయించారని.. అన్నింటికీ ప్రధాన సూత్రధారి పట్నం నరేందర్ రెడ్డి అని వాదించారు. నరేందర్ రెడ్డికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించింది. తన అనుచరులతో కలిసి స్కెచ్ వేశారని కోర్టుకు పీపీ తెలియజేశారు. ఎవరు అనుచరులు.. అతని హోదా ఏంటి అని ధర్మాసనం మరో ప్రశ్న వేయగా.. సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు అని తెలిపారు. సంఘటన జరిగిన రోజు సురేష్ ... నరేందర్ కాల్స్ మాట్లాడుకున్నారని చెప్పారు. అరెస్ట్ సందర్బంగా ఎలాంటి నియమాలు పాటించారని పీపీని హైకోర్టు అడిగింది.

ఒరిగిపోయిన భవనం నేలమట్టం...


కేబీఆర్‌ పార్క్‌లో ఒక మాజీ ఎమ్మెల్యేను ఎలా అరెస్ట్ చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే కేబీఆర్‌ పార్క్‌లో అరెస్ట్ చేయలేదని తన ఇంట్లో అరెస్ట్ చేశామని కోర్టుకు పీపీ తెలిపారు. సుప్రీం తీర్పులను ఎందుకు పాటించలేదని హైకోర్టు అడుగగా... ఈ కేసులో కుట్ర కోణం ఉందని.. చాలా విషయాలు బయటకు వచ్చాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. ఇరువురి వాదనలు ముగిసిన అనంతరం... ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్‌ను సబ్మిట్ చేయాలని పోలీసులకు ధర్మాసనం ఆదేశించింది. అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.


ఇవి కూడా చదవండి..

బాబోయ్ మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

ఉడుము పవర్ అంటే ఇదీ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 20 , 2024 | 01:11 PM