Share News

Chandrababu: మళ్ళీ సుపరిపాలన చూస్తారు..: చంద్రబాబు

ABN , Publish Date - Jul 07 , 2024 | 01:57 PM

హైదరాబాద్: నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ క్యాడర్‌తో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1995లో పరిపాలనను మళ్ళీ చూపిస్తానని అన్నారు.

Chandrababu: మళ్ళీ సుపరిపాలన చూస్తారు..: చంద్రబాబు

హైదరాబాద్: నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తొలిసారి ఎన్టీఆర్‌ భవన్‌ (NTR Bhavan)కు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ క్యాడర్‌ (TTDP Cadre)తో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1995లో పరిపాలనను మళ్ళీ చూపిస్తానని.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో సమస్యలు పరిష్కారం దిశగా చర్చలు ఫలప్రదంగా జరిగాయన్నారు. విభజన వలన కంటే.. జగన్ (Jagan) పాలనతో ఏపీ ఎక్కువ నష్టపోయిందని, ఏపీలో కూటమి రాకపోయి ఉంటే.. తెలంగాణకు ఆంధ్రకు వంద శాతం తేడా ఉండేదన్నారు.


తెలంగాణలో యువతకు, చదువుకున్న వారికి నాయకత్వం అప్పగిస్తామని, తెలంగాణ గడ్డపైనే తెలుగుదేశం పార్టీ పుట్టిందని చంద్రబాబు అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒకస్థాయికి వచ్చేసిందని, తలసారి ఆదాయంలో తెలంగాణ.. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర కంటే ముందుందన్నారు. తెలంగాణను తర్వాత స్థాయికి తీసుకెళ్ళటానికి ఇక్కడ నాయకులకు అవకాశముందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇబ్బందుల నుంచి గట్టెకించే బాధ్యత తనదన్నారు. పక్క రాష్ట్రంతో గొడవలు పెట్టుకుంటే.. అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందన్నారు.


చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం చేసుకుందామని, రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలు తనకు తెలుసునని చంద్రబాబు అన్నారు. విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వారిదేనని, అభివృద్ధి కోసం ఐక్యమత్యంతో పని చేద్దామని సూచించారు. జై తెలంగాణ .. నినాదంతో సీఎం చంద్రబాబు తన ప్రసంగం ముగించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నా కోసం చేసిన ఆందోళనలు చూసి గర్వపడ్డా..

రుషికొండ భవనాలకు నోటీసులు

కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్?

ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్ఐ.. చికిత్స పొందుతూ మృతి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 07 , 2024 | 01:59 PM