Share News

America: రూపేశ్ చంద్ర చింతకింది అదృశ్యం

ABN , Publish Date - May 09 , 2024 | 01:56 PM

అమెరికాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు వరుసగా ప్రమాదానికి గురవుతున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో కలకలం రేగుతోంది. తాజాగా షికాగోలో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు.

America: రూపేశ్ చంద్ర చింతకింది అదృశ్యం
Rupesh Chandra Chintakindi

వాషింగ్టన్, మే 09: అమెరికాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు వరుసగా ప్రమాదానికి గురవుతున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో కలకలం రేగుతోంది. తాజాగా షికాగోలో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడు ఆచూకీ తెలియడం లేదని అక్కడి భారత రాయబారి కార్యాలయం వెల్లడించింది.

భారత్‌లోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన రూపేశ్ చంద్ర చింతకింది గత వారం రోజులుగా కనిపించడం లేదని స్పష్టం చేసింది. అతడి ఆచూకీ కోసం స్థానిక పోలీసులు, ప్రవాస భారతీయులతో సంప్రదింపులు జరుపుతున్నామని రాయబారి కార్యాలయం తెలిపింది. రూపేశ్ చింతకింది... విస్కాన్సిన్‌లోని కాంకార్డియా యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నారని పేర్కొంది. అయితే రూపేశ్ అదృశ్యం కావడంతో.. తెలంగాణలోని అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

AP News: జగన్ చెప్పింది చేయరు.. చేసేది చెప్పరు: కనకమేడల


తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలంటూ వారు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతోపాటు అమెరికా ఎంబసినీ కోరారు. అలాగే తమ కుమారుడి ఆచూకీ తెలుసుకోవాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సైతం వారు లేఖ రాశారు. దీంతో భారత విదేశీ మంత్రిత్వ శాఖ కార్యాలయంతోపాటు అమెరికా ఎంబసికి సైతం ఆయన లేఖ రాసి.. రూపేశ్ ఆచూకీ కనుగోనాలని సూచించారు.

LokSabha Elections: ప్రియాంక గాంధీకి స్మృతి ఇరానీ సవాల్

మరోవైపు అమెరికాలో వరుసగా దాడులు, కిడ్నాప్‌లు, హత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనల్లో బాధితులుగా భారతీయ సంతతికి చెందిన వారు సైతం ఉంటున్నారు. అయితే ఈ దాడులపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. అమెరికాలోని విదేశీ విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read Latest Natinal News And Telugu News

Updated Date - May 09 , 2024 | 02:09 PM