Share News

CM Revanth : ఎన్టీఆర్‌ మార్గ్‌లో పనులు కాంట్రాక్టర్ల కోసమా?

ABN , Publish Date - Jul 03 , 2024 | 02:57 AM

‘ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఎప్పుడూ పనులు చేస్తారెందుకు? రోడ్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణమో, మరమ్మతో, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎందుకలా?

CM Revanth : ఎన్టీఆర్‌ మార్గ్‌లో పనులు కాంట్రాక్టర్ల కోసమా?

ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తుంటారెందుకు?

అధికారులను ప్రశ్నించిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌ సిటీ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ‘ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఎప్పుడూ పనులు చేస్తారెందుకు? రోడ్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణమో, మరమ్మతో, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎందుకలా? నిజంగా ఆ స్థాయిలో పనులు చేయాల్సిన అవసరముందా? కాంట్రాక్టర్ల కోసం చేస్తారా?’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులను అడిగినట్లు తెలిసింది. సచివాలయానికి వచ్చే క్రమంలో తాను పరిశీలిస్తూ ఉంటానని, ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుందని ఆయన వారితో అన్నట్లు సమాచారం. హెచ్‌ఎండీఏ పరిధి లో ఆ రహదారి ఉండడం సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఓ పోలీస్‌ అధికారి స్పందించినట్టు తెలిసింది. వినాయక నిమజ్జనం ఇతరత్రా అవసరాల కోసం ఫుట్‌పాత్‌ల తొలగింపు, రహదారి మరమ్మతు వంటి పనులు చేస్తుంటారని ఆయన చెప్పినట్టు సమాచారం.

Updated Date - Jul 03 , 2024 | 09:43 AM