Share News

దళితుల హామీలను నెరవేర్చాలని బీజేపీ ధర్నా

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:47 AM

రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవే ర్చాలని డిమాండ్‌ చేస్తూ ధర్మపురి పట్టణంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దొనకొండ నరేష్‌ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం రాస్తా రోకో ధర్నా నిర్వహించారు.

దళితుల హామీలను నెరవేర్చాలని బీజేపీ ధర్నా
ధర్మపురి జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న నాయకులు

ధర్మపురి, జూలై 26: రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవే ర్చాలని డిమాండ్‌ చేస్తూ ధర్మపురి పట్టణంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దొనకొండ నరేష్‌ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. ఉదయం వివిధ గ్రామాలకు చెందిన కార్యకర్తలు మండల తహ సీల్దార్‌ కార్యాలయం ఎదుట గల జాతీయ రహదారి వరకు చేరుకున్నారు. అనం తరం రహదారిపై బైఠాయింపు జరిపి నిరసన వ్యక్తం చేశారు. రహదారి ఇరు వైపుల వాహనాలు నిలచి పోయాయి. కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బి ల్లులో దళితులకు 350 కోట్ల వరకు తగ్గించారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వంత నియోజకవర్గానికి 4369 కోట్ల బడ్జెట్‌ కేటాయించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ లోన్స్‌, వివిధ రకాల దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేనియెడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విషయం తెలసుకున్న ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ చేరుకుని కార్యకర్తలకు నచ్చ జెప్పి ఆందోళన విరమింప జేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌ కొమ్ము రాంబాబు, కో కన్వీనర్‌ బండారి లక్ష్మణ్‌, ఎస్పీ మోర్చా జిల్లా ప్రఽధాన కార్యదర్శి దొనకొండ నరేష్‌, యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్‌, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌, ధర్మపురి మండల అధ్యక్షులు సంగెపు గంగారాం, పట్టణ అధ్యక్షులు బెజ్జారపు లవణ్‌, యువ మోర్చా పట్టణ అధ్యక్షుల గాజు భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:47 AM