Share News

నల్ల బ్యాడ్జీలతో వైద్యుల నిరసన

ABN , Publish Date - May 09 , 2024 | 12:32 AM

జగిత్యాల జిల్లా కోరుట్ల అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో వైద్యునిపై, వైద్య సిబ్బందిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంగళ వారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిర సన తెలిపారు.

నల్ల బ్యాడ్జీలతో వైద్యుల నిరసన

కళ్యాణ్‌నగర్‌, మే 8: జగిత్యాల జిల్లా కోరుట్ల అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో వైద్యునిపై, వైద్య సిబ్బందిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంగళ వారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిర సన తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు శిరీష మాట్లాడుతూ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కు ఓ రోగి అపస్మారక స్థితిలో వచ్చారని, ఆయన మార్గమధ్యలోనే మృత్యు వాత పడ్డాడని, కానీ వైద్యునిపై మృతుని బంధువులు డీజిల్‌ పోసి నిప్పంటిం చేందుకు ప్రయత్నించారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఎవరూ కూడా రోగిని చంపాలని చూడరని, వైద్యుడు అప్పటికే మృతుని బంధువులతో మాట్లాడి పక్క రూంలోకి వెళ్లి గడియ పెట్టుకోగా, అక్కడున్న కొందరు డీజిల్‌ పోయడంతో పాటు ఆసుపత్రి పరికరాలను ధ్వంసం చేయడం సరైంది కాదన్నారు. వైద్యునిపై అకార ణంగా సస్పెన్షన్‌ వేటు వేశారని, నిజానిజాలు తెలియకుండా సస్పెండ్‌ ఎలా చేస్తా రని, వైద్యునిపై విధించిన సస్పెన్షను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్య క్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:32 AM