15లోపు అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలి
ABN , Publish Date - Nov 21 , 2024 | 12:19 AM
జిల్లాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సరఫరా పనులు డిసెం బర్ 15లోగా పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులకు సూచించారు.
పెద్దపల్లి కల్చరల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సరఫరా పనులు డిసెం బర్ 15లోగా పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష కలెక్టరేట్‌లో అంగన్‌వాడీ సెంటర్లకు విద్యుత్ సరఫరాపై సంబం ధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 700పైగా అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సరఫరా, ఫ్యాన్, లైట్ మొదల గు సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ పనులు డిసెంబర్ 15లోగా పూర్తిచేయాలని, ప్రైవేట్ అంగన్‌వాడీ భవనాలలో సైతం ఈ వసతులు కల్పించాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు సం బంధించి అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రత్యేక మీటర్ల ఏర్పాటు చేయాలని, దానికి అవసరమైన నిధులు కలెక్టరేట్ నుంచి అం దించడం జరుగుతుందని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలకు రెండు ఫ్యాన్లు, 3 ట్యూబ్‌లైట్లు, ఫ్లగ్ పాయింట్, వైరింగ్ మొదలగు ఏర్పాట్లు కూడా స్థానిక ఎలక్ట్రీషియన్‌తో చేయించాలని, దీనికి అయ్యే ఖర్చు ప్రతిపాదనలు ఈనెల30 నాటికి సమర్పిస్తే వెంటనే మంజూరుచేయడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి వేణు గోపాల్‌రావు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.