Share News

సాంస్కృతిక కార్యక్రమాలతో నూతనోత్సాహం

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:46 AM

సాంస్కృతిక కార్యక్రమాలతో నూత నో త్సాహం రెట్టింపు అవుతుందని అల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డా.నరేం దర్‌ రెడ్డి అన్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలతో నూతనోత్సాహం

అల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మెన్‌ డా.నరేంధర్‌ రెడ్డి

ఆకట్టుకున్న అల్ఫోర్స్‌ స్వాగతోత్సవ్‌-2024

జగిత్యాల అర్బన్‌, జూలై 26: సాంస్కృతిక కార్యక్రమాలతో నూత నో త్సాహం రెట్టింపు అవుతుందని అల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డా.నరేం దర్‌ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్ధానిక వాసవి గార్డెన్‌లో అల్పోర్స్‌ బాలికల జూనియర్‌ కళాశాల నూతన విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఫ్రెషర్స్‌ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరేందర్‌ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్ర మాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తు త పరిస్థితుల్లో సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరిగిందని అదే సమయంలో అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు ముందుకు సాగుతు న్నారన్నారు. తల్లితండ్రులు కూడా విద్యార్ధులు ఎంచుకున్న లక్ష్యాలను చేధించేందుకు తోడ్పాటును అందించాలన్నారు. గత 34ఏళ్లుగా అల్ఫొర్స్‌ విద్యాసంస్ధలు నిర్విరామంగా చేస్తున్న కృషి చేస్తుందని, విద్యాభివృద్ధిలో నూతన ఒరవడిని సృష్టిస్తూ సమాజంలో మార్పులకు అనుగుణంగా ముందుకుసాగుతూ సంచలన విజయాలు నమోదు చేస్తున్నామ న్నా రు. విద్యార్థులను అన్ని రకాలుగా అభివృద్ది పర్చడమే లక్ష్యమని పేర్కొ న్నారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులచే ప్రదర్శించబడిన పలు నృ త్య, సాంస్కృతిక ప్రదర్శనలు అహుతులను అలరించాయి. అనంతరం వార్షిక ప్రణాళికల్లో భాగంగా నిర్వహించిన పరీక్షలు, క్రీడా పోటీల్లో ప్రతి భ కనబర్చిన విద్యార్థులకు ఆయన చేతులమీదుగా బహుమతులు ప్ర ధానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌, పోషకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:46 AM