Share News

లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:16 AM

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 26న దేశవ్యాప్త నిరసనలో అన్ని వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని ట్రేడ్‌ యూనియన్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు కడారి సునీల్‌, వేల్పుల కుమారస్వామి, ఐ కృష్ణ, తోకల రమేష్‌, కే విశ్వ నాథ్‌, వెంకన్న పిలుపునిచ్చారు.

లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

గోదావరిఖని, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 26న దేశవ్యాప్త నిరసనలో అన్ని వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని ట్రేడ్‌ యూనియన్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు కడారి సునీల్‌, వేల్పుల కుమారస్వామి, ఐ కృష్ణ, తోకల రమేష్‌, కే విశ్వ నాథ్‌, వెంకన్న పిలుపునిచ్చారు. బుధవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కొద్దిమంది చేతు ల్లో దేశసంపద కేంద్రీకృతమై ఆర్థిక అసమానాతలు పెరిగి, ఉద్యోగ, ఉ పాధి అవకాశాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార న్నారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ బహుళ జాతి కంపెనీలకు తొత్తుగా వ్యవహరిస్తూ దేశ సంపదను, ప్రభుత్వరంగ సంస్థలను ధారదత్తం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ సహకారంతో అదా నీ చట్టాలను ఉల్లంఘించి దేశంలో అనేక దందాలు చేస్తున్నార ని, కోట్ల ఆస్థులు కూడగట్టుకున్నారని, మోదీ బడ్జెట్‌లో సంక్షేమ పథకాలు, కేటాయింపుల్లో కోత విధించారని, దీంతో ప్రజల జీవ న ప్రమాణాలు దిగజారుతున్నాయన్నారు. రాష్ట్రంలో బీడీ,హమా లీ, భవన నిర్మాణం, గ్రామ పంచాయతీ, మిషన్‌ భగీరథ స్కీమ్‌ వర్కర్లకు, కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ వర్కర్లకు శ్రమ తగిన వేత నాలు ఇవ్వకపోవడంతో వారి బ్రతుకులు దుర్భరంగా మారాయన్నారు. శ్రామికులు సంపద సృష్టికర్తలని, వారికి చట్టబద్ధ హక్కులు కల్పించక పోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని, పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మి కుల వేతనాలు, కూలీ రేట్లు పెంచాలని, అసంఘటితరంగంలో పనిచేస్తు న్న లక్షలాది మంది కార్మికులకు ఎలాంటి హక్కులు కానీ, కనీస సౌక ర్యాలు కానీ కల్పించడం లేదన్నారు. 26న జరిగే దేశ వ్యాప్త నిరసనలో అన్నివర్గాల వారు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో నాయకులు ఈదునూరి నరేష్‌, శంకర్‌, నర్స య్య, రవి, అశోక్‌, వైకుంఠం పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 12:16 AM