Share News

కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు

ABN , Publish Date - May 09 , 2024 | 01:18 AM

పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథని అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగే కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా కొనసాగించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ తెలిపారు.

కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు
స్ట్రాంగ్‌ రూంను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌

- కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌

రామగిరి, మే 8: పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథని అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగే కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా కొనసాగించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ తెలిపారు. బుధవారం జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ సెంటర్‌లను ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ నమోదైన ఈవీఎం యంత్రాల తరలింపునకు స్ట్రాంగ్‌రూమ్‌లను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడారు. మే 13న పోలింగ్‌ ముగిసిన అనంతరం పోలైన ఈవీఎం యంత్రాలు రిసెప్షన్‌ కేంద్రాల నుంచి నేరుగా జేఎన్టీయూ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేరుకుంటాయని తెలిపారు. జేఎన్టీయూ కళాశాలలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన స్ట్రాంగ్‌ రూంలను పరిశీలించి తగిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఈవీఎంలను భద్రపరిచేందుకు నియోజకవర్గాల వారీగా ముందుగానే మార్కింగ్‌ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. స్ట్రాంగ్‌రూం వెలుప ల సీసీ కెమెరాలు, పోలీసుల పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్‌ పూర్తి అయ్యే వరకు అధికారులు అప్రమత్తతో వ్యవహరించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. ఆయన వెంట సహాయ రిటర్నింగ్‌ అధికారులు హను మానాయక్‌, గంగయ్య, తహసీల్దార్‌లు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 01:18 AM