దసరా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్
ABN , Publish Date - Oct 12 , 2024 | 12:25 AM
గోదావరిఖని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ దశమి సందర్భంగా శనివారం నిర్వహించనున్న దసరా ఉత్సవాల వేడుకల ఏర్పాట్లను శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ పరిశీలించారు.
కోల్‌సిటీ, అక్టోబరు 11: గోదావరిఖని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ దశమి సందర్భంగా శనివారం నిర్వహించనున్న దసరా ఉత్సవాల వేడుకల ఏర్పాట్లను శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజలు దసరా సంబరాలను వీక్షించే విధంగా అన్నీ ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా, లోటు పాట్లు లేకుండా చూడాలని సింగరేణి అధికారులను ఆదేశిం చారు. దీని కోసం సింగరేణితో పాటు స్థానిక పరిశ్రమల సహకారంతో ఘనంగా ఏర్పాట్లను నిర్వహిస్తున్నట్టు చెప్పా రు. ఆయన వెంట మేయర్ బంగి అనీల్ కుమార్, ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్ ఉన్నారు.